తెలంగాణలో కొత్తగా 573 కరోనా కేసులు..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో గతంతో పోలిస్తే కరోనా కేసులు తగ్గిపోయాయి. ప్రస్తుతం 600 లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా హెల్త్ బులిటెన్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.
గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 573 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 2,77,724కి చేరుకుంది. కాగా.. గడిచిన 24 గంటల్లో నలుగురు మృతి చెందినట్టు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కారణంగా ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 1493కి చేరుకుంది. కాగా నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 609 మంది కోలుకున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ తెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా 2,68,601 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 7,630 యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 5546 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. కాగా.. తెలంగాణలో ఇప్పటి వరకూ 61,64,661 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
కాగా.. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53 శాతం ఉందని.. కోలుకున్న వారి రేటు 96.71 శాతం ఉందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. జీహెచ్ఎంసీలో కొత్తగా 127 కరోనా కేసులు నమోదవగా.. మేడ్చల్ మల్కాజిగిరిలో 67, రంగారెడ్డిలో 58, ఖమ్మంలో 33, వరంగల్ అర్బన్‌లో 33, కరీంనగర్‌లో 22, సంగారెడ్డిలో 17 కేసులు కొత్తగా నమోదయ్యాయని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా.. ఇంకా 613 మందికి నిర్వహించిన పరీక్షల తాలుకు రిపోర్టులు రావాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com