దేశంలో విజృంభిస్తున్న కరోనా.. నేడు దాదాపు 55 వేల కేసులు

  • IndiaGlitz, [Sunday,August 02 2020]

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఐదు రోజులుగా 50 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ కేసుల సంఖ్య 17 లక్షలు దాటేసింది. కరోనా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. 24 గంటల్లో 54,736 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ కేసుల సంఖ్య 17,50,724కు చేరుకుంది. 

గడచిన 24 గంటల్లో 853 మంది కరోనా కారణంగా మృతి చెందగా.. ఇప్పటి వరకూ కరోనాతో 37,364  మంది మృతి చెందారు. కాగా 11,45,629 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవగా.. ప్రస్తుతం దేశంలో 5,67,730 యాక్టివ్ కేసులున్నాయి. దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 65.4 శాతం, మరణాల రేటు 21.3శాతం నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

More News

‘ఆకాశ‌వాణి’ యూనిట్‌కు రానా సపోర్ట్

ఇప్పుడంటే వినోద మాధ్య‌మాలు ఎక్కువైయ్యాయి కానీ.. ఒక‌ప్పుడు అంద‌రికీ ప్ర‌ధాన వినోద సాధనం రేడియోనే.

మోహన్‌బాబు కుటుంబ సభ్యులను హెచ్చరించిన దుండగుల అరెస్ట్

ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు ఫాం హౌస్ వద్ద నిన్న రాత్రి కలకలం రేగింది. జల్పల్లిలోని ఆయన ఫాంహౌస్‌లోకి గత రాత్రి ఓ కారు ఆయన ఇంట్లోకి దూసుకెళ్లింది.

చిరు బర్త్‌డేకు స్పెషల్ గిఫ్ట్ సిద్ధం చేస్తున్న రామ్ చరణ్ యువశక్

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే అయిన ఆగస్ట్ 22 కోసం రామ్ చరణ్ యువశక్తి ఇప్పటి నుంచే గిఫ్ట్‌ను సిద్ధం చేస్తోంది.

తెలంగాణలో నేడు 1891 కేసులు..

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఆదివారం కరోనా హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

ఏపీలో లక్షన్నర దాటిన కరోనా కేసులు.. నేడు ఎన్నంటే..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు లక్షన్నర దాటేశాయి. అయితే గత నాలుగు రోజులతో పోలిస్తే నేడు మాత్రం కేసుల సంఖ్య కాస్త తగ్గింది.