తెలంగాణలో నిన్న ఒక్కరోజే 546 పాజిటివ్ కేసులు

  • IndiaGlitz, [Sunday,June 21 2020]

తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. శనివారం తెలంగాణలో కొత్తగా 546 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7072కి చేరుకుంది. కాగా.. కరోనా కారణంగా శనివారం ఒక్కరోజే ఐదుగురు మృతి చెందారు. దీంతో కరోనా కారణంగా మొత్తం తెలంగాణలో ఇప్పటి వరకూ 203 మంది మృతి చెందారు.

కాగా.. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 458 కేసులు నమోదు కావడం గమనార్హం. అలాగే రంగారెడ్డి జిల్లాలో 50, కరీంనగర్‌లో 13, జనగామలో 10, మేడ్చల్‌లో 6, మహబూబ్ నగర్‌లో 3, వరంగల్ అర్బన్‌లో 2 వరంగల్ రూరల్‌లో 1, ఖమ్మంలో 2, ఆదిలాబాద్‌లో ఒక్క కేసు నమోదు అయింది. కరోనా నుంచి కోలుకుని నిన్న 154 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం 3506 మంది డిశ్చార్జ్ కాగా.. రాష్ట్రంలో 3,363 యాక్టివ్ కేసులున్నాయి.

More News

కరోనా మహమ్మరికి ఔషధం సిద్ధం.. త్వరలోనే మార్కెట్‌లోకి..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి ఔషధం సిద్ధమైంది.

గంగూలీ ఇంట కరోనా కల్లోలం.. నలుగురికి పాజిటివ్

బీసీసీఐ చీఫ్ గంగూలీ ఇంట్లో కరోనా కల్లోలం రేపింది. ఆయన కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

రానా పెళ్లి వేదిక ఇదేనా..!

సినీ ప‌రిశ్ర‌మ‌లో ద‌గ్గుబాటి వారికి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. వీరి మూడోత‌రంగా సినీ రంగంలో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్నాడు రానా ద‌గ్గుబాటి.

నాగార్జునతో గోవా బ్యూటీ..?

గోవా బ్యూటీ ఇలియానా ఒక‌ప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది.

ఏపీలో టెన్త్ పరీక్షలు రద్దు.. విద్యార్థులకు మరో గుడ్ న్యూస్

ఏపీలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.