5న భాయ్ ఆడియో...
Send us your feedback to audioarticles@vaarta.com
రిలయన్స్ సమర్పణలో నాగార్జున నిర్మాతగా అన్నపూర్ణ బ్యానర్ లో నిర్మిస్తున్న చిత్రం 'భాయ్'. ఈ చిత్రంలో నాగార్జున సరసన రిచాగంగోపాధ్యాయ్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని 11 న విడుదల చేస్తున్నట్లు కూడా మనకు తెలుసు. ఈ చిత్రంలో నాగ్ మూడు గెటప్ లలో కనిపిస్తారు.
ఈ మూడు గెటప్స్ మాస్, యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులను ఆలరిస్తుందని చిత్ర యూనిట్ చెబుతుంది. ఈ చిత్ర విడుదలకు ఒక వారం ముందు అంటే అక్టోబర్ 5న చిత్ర ఆడియో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతాన్ని అందిస్తున్నాడు. దేవి చాలా మంచి సంగీతం అందించాడని, ఈ చిత్రానికి చాలా ప్లస్ అవుతుందని నాగ్, వీరభద్రం నమ్మకంగా ఉన్నారు.
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments