మహేష్ దూకుడుకు ఐదేళ్లు..!
Friday, September 23, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు - శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం దూకుడు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మించింది. అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో మహేష్ కెరీర్ లో మరచిపోలేని చిత్రంగా నిలిచిన దూకుడు చిత్రం రిలీజై నేటికి సరిగ్గా ఐదేళ్లు పూర్తయ్యింది. సిన్సియర్ పోలీస్ గా మహేష్ నటన, బ్రహ్మి, ఎం.ఎస్.నారాయణ ల కామెడీ, శ్రీను వైట్ల టేకింగ్, తమన్ సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆక్టటుకుంది. ముఖ్యంగా తండ్రి కోసం లేని ప్రపంచాన్ని సృష్టించిన తనయుడుగా మహేష్ అద్భుతంగా నటించి అందరి మనసులు దోచుకున్నాడు.
ఇక ఈ సినిమాలో నటించకపోయినా...సినిమా విజయానికి ఒక కారణంగా నిలిచారో స్టార్..! ఆయనే టాలీవుడ్ కింగ్ నాగార్జున. ఈ మూవీలో రియాలిటి షో సృష్టికర్త, మాటీవీ ఓనర్ నాగార్జున కోసం అంటూ ఓ రియాలిటీ షో ఎపిసోడ్ క్రియేట్ చేసారు. దీనిని ఆడియోన్స్ బాగా ఎంజాయ్ చేసారు. ఇలా అన్ని అంశాలు ఈ మూవీకి బాగా కుదరడంతో దూకుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో సైతం సంచలనం సృష్టించింది. మహేష్ లోని ఓ కొత్తకోణాన్ని ఆవిష్కరించిన దూకుడు చిత్రం రిలీజై నేటికి ఐదేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా 14 రీల్స్ సంస్థ రామ్ నటించిన హైపర్ ఆడియోను ఈరోజు రిలీజ్ చేస్తుండడం విశేషం..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments