నాయక్' కు 5 ఏళ్ళు

  • IndiaGlitz, [Tuesday,January 09 2018]

చెడు మీద మంచి విజయం సాధించాలంటే ఆ మంచికి ప్రోత్సాహం, మద్దతు కూడా ఉండాలి.. అప్పుడే ఆ మంచి గెలుస్తుంది. సరిగ్గా ఇదే పాయింట్ తో నాయక్' సినిమాని తెరకెక్కించి హిట్ కొట్టారు ద‌ర్శ‌కుడు వి.వి.వినాయక్, క‌థానాయ‌కుడు రామ్ చరణ్. మొదటిసారిగా రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్, అమలా పాల్ కథానాయికలుగా నటించారు. బ్రహ్మానందం, రాహుల్ దేవ్, ప్రదీప్ రావత్, జయ ప్రకాష్ రెడ్డి, ఆశిష్ విద్యార్ధి, పోసాని కృష్ణ మురళి ఇత‌ర ముఖ్య పాత్రల్లో నటించారు.

ఆకుల శివ అందించిన ఈ కథకి తమన్ స్వరాలను అందించారు. అప్పట్లో ఈ సినిమాలోని పాటలన్నీ శ్రోతలను ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా చిరంజీవి నటించిన కొండవీటి దొంగ' సినిమాలోని “శుభలేఖ రాసుకున్న‌” పాటను రీమిక్స్ చేసి అల‌రించాడు తమన్. ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య, ఎస్.రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. జనవరి 9, 2013న‌ సంక్రాంతి సందర్భంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించిన ఈ సినిమా.. నేటితో 5 సంవత్సరాలను పూర్తిచేసుకుంటోంది.