ఏపీలో కరోనా బీభత్సం.. నేడు 5వేలు దాటిన కేసులు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో కరోనా బీభత్సం సృష్టించింది. గడిచిన 24 గంటలకు సంబంధించిన కరోనా బులిటెన్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే కరోనా కేసులు ఐదు వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 31,148 శాంపిల్స్‌ని పరీక్షించగా 5041 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఒక్కరోజే కరోనాతో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా అత్యధికంగా ఈస్ట్ గోదావరి జిల్లాలోనే అత్యధికంగా కేసులు, మరణాలు నమోదు కావడం గమనార్హం. ఇక్కడ ఇవాళ ఒక్కరోజే 647 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
కొద్ది రోజులకు ముందు గ్రీన్ జోన్లో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో సైతం ఇప్పుడు 535 కేసులు నమోదు కావడం గమనార్హం. నేడు కరోనాతో తూర్పు గోదావరి జిల్లాలో 10 మంది.. శ్రీకాకుళంలో 8 మంది.. కర్నూలులో ఏడుగురు.. కృష్ణలో ఏడుగురు.. ప్రకాశంలో నలుగురు.. అనంతపూర్‌లో ముగ్గురు.. కడపలో ముగ్గురు.. విజయనగరంలో ముగ్గురు.. గుంటూరులో ఇద్దరు.. చిత్తూరులో ఇద్దరు మరణించారు. కాగా నేడు కరోనా నుంచి కోలుకుని 22890 మంది డిశ్చార్జ్ కాగా.. 26118 యాక్టివ్ కేసులున్నాయి.
#COVIDUpdates: 19/07/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) July 19, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 46,755 పాజిటివ్ కేసు లకు గాను
*20,329 మంది డిశ్చార్జ్ కాగా
*642 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 25,784#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/0r8Sa7yM0z
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout