ఏపీలో కరోనా బీభత్సం.. నేడు 5వేలు దాటిన కేసులు..

  • IndiaGlitz, [Monday,July 20 2020]

ఏపీలో కరోనా బీభత్సం సృష్టించింది. గడిచిన 24 గంటలకు సంబంధించిన కరోనా బులిటెన్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే కరోనా కేసులు ఐదు వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 31,148 శాంపిల్స్‌ని పరీక్షించగా 5041 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఒక్కరోజే కరోనాతో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా అత్యధికంగా ఈస్ట్ గోదావరి జిల్లాలోనే అత్యధికంగా కేసులు, మరణాలు నమోదు కావడం గమనార్హం. ఇక్కడ ఇవాళ ఒక్కరోజే 647 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

కొద్ది రోజులకు ముందు గ్రీన్ జోన్‌లో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో సైతం ఇప్పుడు 535 కేసులు నమోదు కావడం గమనార్హం. నేడు కరోనాతో తూర్పు గోదావరి జిల్లాలో 10 మంది.. శ్రీకాకుళంలో 8 మంది.. కర్నూలులో ఏడుగురు.. కృష్ణలో ఏడుగురు.. ప్రకాశంలో నలుగురు.. అనంతపూర్‌లో ముగ్గురు.. కడపలో ముగ్గురు.. విజయనగరంలో ముగ్గురు.. గుంటూరులో ఇద్దరు.. చిత్తూరులో ఇద్దరు మరణించారు. కాగా నేడు కరోనా నుంచి కోలుకుని 22890 మంది డిశ్చార్జ్ కాగా.. 26118 యాక్టివ్ కేసులున్నాయి.

More News

‘ప్రభాస్ 21’పై మండిపడిన దీపిక పదుకొణె..

వైజయంతి మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వనీదత్ నిర్మాణంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 21వ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే.

చిలుకూరు ఆలయంలో అద్భుతం.. శుభసంకేతమంటున్న రంగరాజన్

చిలుకూరు బాలాజీ అంటే భక్తులకు అపారమైన నమ్మకం. అక్కడ ఏదైనా అనుకుని 11 ప్రదక్షిణలు చేస్తే అది తప్పక జరిగి తీరుతుందనేది భక్తుల విశ్వాసం.

జూలై 31న ‘జీ 5’లో మరో కొత్త సిరీస్‌... మేక సూరి

‘జీ 5’ ఓటీటీలో వచ్చిన ఒరిజినల్‌ తెలుగు సిరీస్‌ ‘గాడ్‌’ (గాడ్స్‌ ఆఫ్‌ ధర్మపురి) వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

కింగ్‌(ప్రభాస్‌)కి క్వీన్ సెట్.. పిచ్చెక్కించేద్దాం: నాగ్ అశ్విన్

‘మహానటి’తో దర్శకుడిగా తన సత్తాను నిరూపించుకున్న నాగ్ అశ్విన్ తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ 21వ చిత్రాన్ని  తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.

మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..

మరో వైసీపీ ఎమ్మెల్యేకు తాజాగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటీవలి కాలంలో వైసీపీ ఎమ్మెల్యేలు వరుసగా..