ఐదు రాష్ట్రాల ఎన్నికలు : యూపీ, ఉత్తరాఖండ్‌లలో ‘‘కమల’’ వికాసం.. పంజాబ్‌ను ఊడ్చేసిన ‘‘ఆప్’’
Send us your feedback to audioarticles@vaarta.com
2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తోన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ.. యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో బీజేపీ దూసుకెళ్తోంది. ఇక పంజాబ్‌లో ఆప్ ముందంజలో వుంది.
ఉత్తరప్రదేశ్ (403) లో 268 చోట్ల బీజేపీ ముందంజలో వుండగా.. సమాజ్‌వాదీ పార్టీ 121 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. కాంగ్రెస్, బీఎస్పీలు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోతున్నాయి. పంజాబ్ (117) లో ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. సామాన్యుడి పార్టీ 89 స్థానాల్లో ముందంజలో వుండగా అధికార కాంగ్రెస్ 11 చోట్ల, ఎస్‌ఏడీ కూటమి 11 చోట్ల ఆధిక్యంలో వున్నాయి. పంజాబ్‌లో బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది.
ఉత్తరాఖండ్ (70) లో 45 చోట్ల బీజేపీ ఆధిక్యంలో వుండగా.. కాంగ్రెస్ 22 స్థానాల్లో ముందంజలో ఉంది. గోవా (40) లో 18 చోట్ల బీజేపీ, కాంగ్రెస్ కూటమి 12, తృణమూల్ 4 చోట్ల ఆధిక్యంలో వున్నాయి. మణిపూర్ (60) లో బీజేపీ 25, కాంగ్రెస్ 12 చోట్ల ఆధిక్యంలో ఉండగా 10 చోట్ల ఎన్సీపీ ముందంజలో ఉంది. ఈ ఫలితాలతో దేశవ్యాప్తంగా కాషాయ శ్రేణులు సంబరాలు చేసుకుంటుండగా.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments