5 భాషలు, ఐదుగురు సింగర్స్.. RRR ఫస్ట్ సాంగ్ కు ముహూర్తం ఫిక్స్
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకధీరుడు రాజమౌళి సారధ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషనల్ స్ట్రాటజీస్ అదిరిపోతున్నాయి. ఇటీవల మేకింగ్ వీడియోతో సినిమాపై అంచనాలు రెట్టింపు చేసేశారు. ఇక పాటల సందడి షురూ కానుంది. ఈ చిత్రంలోని తొలి పాటగా ప్రమోషనల్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు.
ఇదీ చదవండి: హర్రర్ తో నాగచైతన్య ఓటిటి ఎంట్రీ.. మూడోసారి అదే డైరెక్టర్ తో..
ప్రమోషనల్ సాంగ్ ని భారీ స్థాయిలో షూట్ చేసినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా చిత్రం కనుక కీరవాణి ప్రతి భాషలో పాపులర్ సింగర్స్ ని ఎంపిక చేసి ఈ పాటని పాడించారు.
తాజాగా సాంగ్ రిలీజ్ అప్డేట్ వచ్చింది. ఆగష్టు 1న ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఉదయం 11 గంటలకు దోస్తీ అనే సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించారు. తెలుగులో ఈ పాటని ప్రముఖ గాయకుడు హేమచంద్ర పాడారు.
హిందీలో ప్రముఖ మ్యుజీషియన్ అమిత్ త్రివేది, తమిళంలో యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, మలయాళంలో విజయ్ ఏసుదాస్, కన్నడలో యాసిన్ నిజార్ ఈ పాటని పాడారు. రాంచరణ్, ఎన్టీఆర్ తో పాటు రాజమౌళి హీరోలు ప్రభాస్, రవితేజ, నితిన్, సునీల్, రానా, నాని ఈ సాంగ్ షూట్ లో పాల్గొన్నట్లు ఇన్సైడ్ టాక్.
ప్రస్తుతానికి ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం రాజమౌళి పోస్ట్ ప్రొడక్షన్, ప్రచార కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 13న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
అల్లూరి, కొమరం భీం పాత్రలతో కల్పిత గాధ సృష్టించిన రాజమౌళి.. ఈ చిత్రంతో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారు.. బాహుబలి తర్వాత ఈ చిత్రం ఏ స్థాయిలో ఉండబోతోంది అనే అంచనాలు దేశం మొత్తం నెలకొని ఉన్నాయి.
The First Song from #RRRMovie on August 1st, 11 AM.??#Dosti #Natpu #Priyam ????
— RRR Movie (@RRRMovie) July 27, 2021
An @mmkeeravaani Musical.??
??@itsvedhem @anirudhofficial @ItsAmitTrivedi @IAMVIJAYYESUDAS #YazinNizar@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @DVVMovies @LahariMusic @TSeries pic.twitter.com/dyBaFxQPxt
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments