విజయనగరంలో రెండు బస్సులు, లారీ ఢీ.. ఐదుగురి మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
అతివేగంతో పాటు.. డంపింగ్ యార్డులో చెత్త తగులబెట్టడం వెరసి పెను ప్రమాదానికి కారణమయ్యాయి. డంపింగ్ యార్డును తగులబెట్టడంతో ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. అలాంటి చోట ఎంత జాగ్రత్తగా రావాలి. కానీ లారీ, బస్సు వేగం మాత్రం తగ్గించలేదు. దీంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. అదే సమయంలో అటుగా వచ్చిన మరో ఆర్టీసీ బస్సు సైతం వెనుక నుంచి ముందున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రాంతమంతా క్షణాల్లో భయానకంగా మారిపోయింది.
అసలు విషయంలోకి వెళితే.. విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న గ్యాస్ సిలిండర్ల లారీ, ఆర్టీసీ బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అదే సమయంలో వైజాగ్ వైపు నుంచి విజయనగరం వస్తున్న మరో ఆర్టీసీ బస్సు.. ముందున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఘటనలో 32 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు 108కు సమాచారం అందించి.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో డంపింగ్ యార్డు ఉండటంతో చెత్తను తగులబెట్టారు. దీంతో ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోగా.. అతి వేగం కూడా ప్రమాదానికి కారణమైనట్టు తెలుస్తోంది. లారీ, మరో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో పరిస్థితి భయానకంగా మారింది. మధ్యలో ఉన్న బస్సుతో పాటు వెనుక నుంచి ఢీకొట్టిన బస్సు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గ్యాస్ సిలిండర్లు పేలకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments