5కోట్ల మంది మహిళలు చంద్రబాబుగారి బొమ్మలే!
Send us your feedback to audioarticles@vaarta.com
దివ్యవాణి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. బహుశా సినిమాల్లో ఉన్నప్పుడు ఈమె పెద్దగా ఎవరికీ తెలియకపోయినప్పటికీ.. రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత 'దివ్యవాణి' పేరు మార్మోగుతోంది. ఇందుకు కారణం ఆమెకున్న వాక్‌చాతుర్యం.. ఫైర్‌బ్రాండ్ అనే ఒక ముద్రేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్న మరుక్షణం నుంచి ఆ పార్టీ నేతలు రోజా గురించి మాట్లాడటం దాదాపు మానేశారు.
యాక్టర్ నుంచి పొలిటిషియన్‌గా టర్న్ తీసుకున్న రోజాను.. అదే రీతిలో వచ్చిన దివ్యవాణితో విమర్శలు చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా.. దివ్యవాణికి బాపుగారి బొమ్మ అనే పేరుంది.. అయితే ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత బాబుగారి బొమ్మలాగా మారిపోయారని పెద్ద ఎత్తున విమర్శలు వినవస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలు, విమర్శలపై ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ వేదికగా ఆమె సమాధానమిచ్చారు.
మీరు బాపుగారి బొమ్మనా..? బాబుగారి బొమ్మనా? అనే ప్రశ్నకు ఆమె ఇలా సమాధానమిచ్చారు.
దివ్యవాణి మాటల్లోనే..."కొందరు పనికిమాలిన వాళ్లు ఇలా ఆరోపణలు చేస్తున్నారు. వారికి సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నా అంతరంగంలో నేను క్రీస్తు బొమ్మను. బాబుగారి బొమ్మ అంటే.. ఒక్క నేనే కాదు.. ఆంధ్రరాష్ట్రంలో ఉన్న 5కోట్ల మహిళలు కూడా చంద్రబాబుగారి బొమ్మలే. ఎందుకంటే.. ఆయన చల్లని పరిపాలనలో వృద్ధ మహిళలు, వితంతువులు, గర్భిణి స్త్రీలు, విడాకులు తీసుకున్నవారు ప్రతి ఒక్కరూ కూడా సంవృద్ధిగా సంతోషంగా ఉన్నారు.
కేంద్రం నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోయినా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. సో.. నేనే కాదు ప్రతి మహిళ కూడా చంద్రన్న చేతి బొమ్మలుగానే సంతోషంగా ఉన్నారు" అని ఆమె చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలకు వైసీపీ నేతల నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com