Hair Robbing:ఎంతకి తెగించార్రా.. గుజరాత్‌లో రెండు బస్తాల వెంట్రుకలు చోరీ, అంత విలువా..?

  • IndiaGlitz, [Friday,May 12 2023]

ఎక్కడైనా దొంగలంటే డబ్బు, బంగారం ఇతర విలువైన వస్తువులను దోచుకుంటారు. ఇందుకోసం అడ్డొచ్చిన వాళ్లని సైతం దారుణంగా హతమారుస్తారు. కానీ గుజరాత్‌లో విచిత్ర సంఘటన జరిగింది. దొంగలు తల వెంట్రుకలను దొంగతనం చేశారు. వినడానికే ఆశ్చర్యంగా వుంది కదూ. వివరాల్లోకి వెళితే.. రాజ్‌కోట్ శివార్లలోని పిప్లియా ప్రాంతంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారి రెండు బస్తాల వెంట్రుకలను తన బైక్‌పై పెట్టుకుని మోర్బీ అనే ప్రాంతానికి వెళ్తున్నాడు. ఈ రెండు బస్తాల్లో 40 కిలోల బరువున్న వెంట్రుకలు వున్నాయి.

గంటల వ్యవధిలో దొంగలను పట్టుకున్న పోలీసులు :

ఈ క్రమంలో ముగ్గురు దుండగులు ఆటోలో వచ్చి బాధితుడిని అడ్డగించి అతని దగ్గర వున్న బస్తాలను దోచుకెళ్లారు. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు దొంగలను పట్టుకున్న పోలీసులు.. వారి వద్ద నుంచి వెంట్రుకల బస్తాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రోహిత్, రవి, రాహుల్, పురుషోత్తం భాయ్, లాల్జీ చౌహాన్‌లుగా గుర్తించారు. ఈ వెంట్రుకల విలువ రూ.2 లక్షలు వుంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఐదుగురికి గతంలో నేరం చేసిన చరిత్ర వుందని వెల్లడించారు.

జుట్టుకు విపరీతమైన గిరాకీ :

రకరకాల కారణాలతో మహిళల జుట్టు ఊడిపోతుంది. ఆ వెంట్రుకలను కొందరు రకరకాల మార్గాల్లో ప్రజల నుంచి కొనుగోలు చేస్తారు. ఇలా సేకరించిన జుట్టును సవరాలు, విగ్గులు తయారు చేసేందుకు వినియోగిస్తున్నారు. ఆధునికకాలంలో జుట్టు ఊడిపోవడం, చిన్న వయసులోనే బట్టతల వంటి కారణాలతో విగ్గులకు చాలా డిమాండ్ వుంది. ఈ నేపథ్యంలోనే వెంట్రుకలను సేకరించేవారు కూడా పెరుగుతున్నారు.

More News

Aha OTT : 'ఆహా' కొత్త మార్కెటింగ్ హెడ్‌గా బద్దం రాజశేఖర్

మిస్ అయిన సీరియల్స్, మంచి వెబ్ షోలు, థియేటర్లకు వెళ్లకుండానే కొత్త సినిమాలు ఇవన్నీ చూసేందుకు అందుబాటులో వచ్చినవే ఓటీటీలు.

Pawan Kalyan : సీఎం పదవి .. పొత్తులపై పవన్ సంచలన వ్యాఖ్యలు, ఈసారి స్వరంలో స్పష్టమైన మార్పు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పవన్ ఈ రోజు పరామర్శించి,

Poonam Kaur: 'అహంకారమా, అజ్ఞానమా' : పవన్ మూవీ పోస్టర్‌పై పూనం కౌర్ షాకింగ్ కామెంట్స్, ఆప్ నేత మద్ధతు.. ఫ్యాన్స్ గరం

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ సినీనటి పూనమ్ కౌర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో

Malli Pelli:నరేష్-పవిత్రల ‘‘మళ్లీ పెళ్లి’’ ట్రైలర్ : మరీ ఇంత బోల్డ్‌గానా.. కాంట్రవర్సీ అవుతుందో, కన్విన్స్ చేస్తారో

పవిత్రా లోకేష్- నరేష్‌ల రిలేషన్‌షిప్ వ్యవహారం టాలీవుడ్ , శాండిల్‌వుడ్‌లను ఈ ఏడాది ఓ కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే.

Rahul Ramakrishna:'అసలు గొడవేంటీ' .. అనసూయ - విజయ్ దేవరకొండ మధ్యలో దూరిన రాహుల్ రామకృష్ణ

రౌడీస్టార్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, స్టార్ యాంకర్ అనసూయ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే.