Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఖరారు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ప్రచారానికి మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో అధికారులు పోలింగ్ ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. తాజాగా ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లు షూరూ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 49 లెక్కింపు కేంద్రాలను ఎంపిక చేసింది. హైదరాబాద్ మహానగరంలో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఇక రంగారెడ్డి జిల్లాలో నాలుగు కేంద్రాలు కేటాయించారు.
హైదరాబాద్ జిల్లా కేంద్రాలు..
ఖైరతాబాద్, జూబ్లీహిల్స్- కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం, యూసుఫ్ గూడ
ముషీరాబాద్- ఏవీ కళాశాల, దోమల్ గూడ.
మలక్పేట- ఇండోర్ స్టేడియం
అంబర్ పేట- రెడ్డి ఉమెన్స్ కళాశాల, నారాయణగూడ
సనత్ నగర్- కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఓయూ క్యాంపస్
నాంపల్లి- జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్, మాసబ్ ట్యాంక్.
కార్వాన్- ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, మాసబ్ ట్యాంక్.
గోషామహల్- తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, కోఠి.
చార్మినార్- కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల, నాంపల్లి.
చాంద్రాయణగుట్ట- నిజాం కళాశాల, బషీర్ బాగ్.
యాకత్ పురా- సరోజిని నాయుడు వనితా మహా విద్యాలయ, నాంపల్లి.
బహదూర్ పురా- అరోరా కళాశాల, బండ్లగూడ.
సికింద్రాబాద్- డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్, ఓయూ.
కంటోన్మెంట్- వెస్లీ కళాశాల, సికింద్రాబాద్.
రంగారెడ్డి జిల్లా కేంద్రాలు..
ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి- సి.వి.ఆర్. ఇంజనీరింగ్ కళాశాల
ఎల్బీనగర్- సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం
రాజేంద్ర నగర్, చేవెళ్ల, షాద్ నగర్- లార్డ్స్ ఇంజనీరింగ్ కళాశాల
శేరిలింగంపల్లి- బాలయోగి స్టేడియం, గచ్చిబౌలి
ఇక మిగిలిని జిల్లాల్లో ఒక్కొటి చొప్పున ఓట్ల లెక్కింపు కేంద్రాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. నవంబర్ 30న 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇక నవంబర్ 28తో ప్రచారం ముగియనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments