ఏపీలో కొత్తగా 48 కరోనా కేసులు.. 101 మంది డిశ్చార్జ్

ఆంధ్రప్రదేశ్‌ కరోనా థాటి నుంచి కాస్త కోలుకున్నట్లే అనిపిస్తోంది. మునుపటితో పోలిస్తే.. వారంరోజులుగా నమోదైన కేసులు చాలా కుదుటపడుతోందనే చెప్పుకోవచ్చు. ఇదివరకు 70,80,90 కేసులు నమోదవ్వగా ఇప్పుడు మాత్రం 50 లోపే కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు డిశ్చార్జ్ సంఖ్య కూడా మెరుగ్గానే ఉంది. కాగా.. గడిచిన 24 గంటలుగా కొత్తగా ఏపీలో 48 మందికి కరోనా సోకినట్లు మీడియా బులెటిన్ నం. 156లో ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్త కేసులతో కలిపితే మొత్తం కేసుల సంఖ్య 2,205కు చేరుకుంది. చిత్తూరులో 8, గుంటూరులో 9, కడపలో 1, కృష్ణా జిల్లాలో 7, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో 9, విశాఖపట్నంలో 4, పశ్చిమ గోదావరిలో 1 కేసు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

9,628 శాంపిల్స్‌ పరీక్షించగా..

గడిచిన 24 గంటల్లో 101 మంది డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటి వరకూ మొత్తం 1,353 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో 803 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. తాజాగా కరోనాతో ఒకరు మృతి చెందగా.. ఇప్పటివరకు ఏపీలో మృతి చెందిన వారి సంఖ్య 49కి చేరుకుంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకూ 9,628 శాంపిల్స్‌ను పరీక్షించగా 48 మందికి మాత్రమే కరోనా ఉన్నట్లు తేలింది. కర్నూలు జిల్లా 608 కేసులతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత గుంటూరు 413, కృష్ణా 367 కేసులు నమోదయ్యాయి. ఇవాళ నమోదైన కేసులన్నీ జిల్లాల వ్యాప్తంగా సింగిల్ డిజిట్‌లోనే నమోదయ్యాయి.

More News

టాలీవుడ్ షూటింగ్స్, షోలు ప్రారంభమైతే ఇలా చేయాల్సిందే!

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ మొదలుకుని బాలీవుడ్, హాలీవుడ్ వరకూ ఎక్కడా సినిమా షూటింగ్స్ జరగట్లేదు. అంతేకాదు.. థియేటర్స్, సినిమా రిలీజ్‌లు కూడా జరగట్లేదు..

నువ్ ఎవడివి నన్ను అడగడానికి.. అనసూయ ఆగ్రహం!

జ‌బ‌ర్‌ద‌స్త్ ప్రోగామ్‌తో పాపులారిటీ సంపాదించుకున్న యాంక‌ర్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్ పుట్టిన‌రోజు నేడు(మే 15). ఈ సంద‌ర్భంగా అన‌సూయ కీస‌ర మండ‌లంలోని ప‌లువురు గ‌ర్భిణీల‌కు న్యూటిష‌న్

యంగ్ డైరెక్టర్ దుర్మరణం.. విషాదంలో శంకర్!

సినిమా ఇండస్ట్రీని విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఓ వైపు కరోనా మహమ్మారి భయం.. మరోవైపు ఇలా వరుస విషాదాలతో ఇండస్ట్రీ అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే పలువురు

ఏపీలో త్వరలో తెరుచుకోనున్న ప్రధాన దేవాలయాలు

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో యావత్ భారతదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్నది. ఇప్పటి వరకూ 3.0 లాక్‌డౌన్లు పూర్తి కాగా రేపో ఎల్లుండో మరోసారి పొడిగింపు

థియేటర్లకు ఆదాయం పెరిగే ఐడియా ఇచ్చిన నాగ్ అశ్విన్!

సావిత్రి బయోపిక్ ‘మహానటి’ చిత్రంతో స్టార్ హోదా అందుకున్న యువ దర్శకుడు నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో ఆయన పేరు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు