ఏపీలో నేడూ కొనసాగిన కరోనా విజృంభణ
- IndiaGlitz, [Sunday,June 21 2020]
ఏపీలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా తాజా కేసుల బులిటెన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం 24 వేల 451 మందికి పరీక్షలు నిర్వహించగా.. 477 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో రాష్ట్రానికి చెందిన 439 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 34 మందికి.. విదేశాల నుంచి వచ్చిన మరో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
కాగా ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7059 కాగా.. 3354 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 3599 మంది చికిత్స తీసుకుంటున్నారు. కాగా నేడు కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూల్‌లో ఒకరు, చిత్తూరులో ఒకరు కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో ఇప్పటికి కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 106కు చేరుకుంది.
#COVIDUpdates: 21/06/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) June 21, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 7059 పాజిటివ్ కేసు లకు గాను
*3354 మంది డిశ్చార్జ్ కాగా
*106 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3599#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/lRJWN83XGy