47 Days Review
లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో చిన్న, ఓ మోస్తరు సినిమాలన్నీ వివిధ ఓటీటీ మాధ్యమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఆ క్రమంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో చిత్రం ‘47 డేస్’. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో మెప్పించిన సత్యదేవ్ అడపా దడపా హీరోగానూ మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. బ్లఫ్ మాస్టర్ తర్వాత సత్యదేవ్ హీరోగా నటించిన చిత్రాల్లో ‘47 డేస్’ ఒకటి. థియేటర్స్ మూత పడటంతో ఓటీటీ మాధ్యమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ సినిమా. మరి ప్రేక్షకులను సినిమా ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం...
కథ:
వైజాగ్ సీటీలో ఎసీపీగా పనిచేసే సత్య(సత్యదేవ్) భార్య పద్మావతి(రోషిణి) ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. ఆ బాధలో కేసును సరిగ్గా డీల్ చేయలేక సస్పెండ్ అవుతాడు సత్య. భార్య చనిపోయిన రోజునే పారిశ్రామిక వేత్త శ్రీనివాస్ చనిపోతాడు. అతని మరణం కూడా అనుమానాస్పదంగా ఉండటంతో తనే సొంతంగా కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతాడు. ఆ క్రమంలో సత్యకి షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలేంటి? అసలు సత్య భార్య ఆత్మహత్యకు, శ్రీనివాస్ మరణానికి ఉన్న లింకేంటి? మిస్టీరియస్ అమ్మాయి జులియట్(పూజా జవేరి)కి ఈ కథకు లింకేంటి? అసలు 47 డేస్ అంటే ఏంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.
విశ్లేషణ:
సస్పెన్స్ థ్రిల్లర్ వెనుక ఉండే సీక్రెట్ ఓ థ్రెడ్ మీద రన్ కావాలి. దాన్ని బేస్ చేసుకుని సన్నివేశాలను అల్లుకుంటే బావుంటుంది. ఏదో రెండు మూడు ట్విస్టులను అనుకుని కథను డెవలప్ చేసుకున్నారేమో అనుకోవాలి. బలహీనమైన పాయింట్ చుట్టూనే కథను నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. జోనర్ ఏదైనా బలమైన ఎమోషన్ ఉండాలి. అప్పుడే అది ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుంది. స్క్రీన్‌ప్లే లోపం కారణమనే చెప్పాలి. అందువల్ల ప్రేక్షకుడు బోరింగ్‌గా ఫీల్ అవుతాడు. అయితే నిర్మాతల్లో ఒకరైన సంగీత దర్శకుడు రఘుకుంచె ఈ సినిమాకు సంగీతం అందించారు. ఆయన నేపథ్య సంగీతంలో సన్నివేశాలకు బలాన్నిచ్చే ప్రయత్నం చేశాడు. అయితే పాటల విషయంలో ఎడిటింగ్ గ్రిప్పింగ్ అనిపించలేదు. విశాఖ బీచ్ అందాలను చక్కగా పిక్చరైజ్ చేశారు. నిర్మాణ విలువలు బావున్నాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే సత్యదేవ్ ఇమేజ్‌తో ప్రేక్షకుడు థియేటర్‌లో కూర్చోవాలంటే కష్టమే కాబట్టి. గ్రిప్పింగ్‌గా సన్నివేశాలుండాలి. ఆ విషంయలో దర్శకుడి ఫెయిల్యూర్ పక్కాగా కనపడింది. ఇక పాటలు స్పీడు బ్రేకర్స్‌లా అనిపించాయి. పూజా జవేరి పాత్రకు కథలో పెద్ద ఇంపాక్ట్ లేదు. ఎప్పుడో జరిగిన ఓ చిన్న ఘటననను ఇప్పుడు తీసుకొచ్చి కథకు మిక్స్ చేయడం వంటి పాయింట్స్‌తో వీక్ అనిపిస్తుంది.
బోటమ్ లైన్: 47 డేస్... బోరింగ్ థ్రిల్లర్
Read '47 Days' Movie Review in English
- Read in English