'47 డేస్' మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రదీప్ మద్దాలిని దర్శకుడిగా పరిచయం చేస్తూ టైటిల్ కార్డ్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న సినిమా "47 డేస్".. "ది మిస్టరీ అన్ ఫోల్డ్స్" అనేది ట్యాగ్ లైన్..సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. సత్య దేవ్, పూజా ఝావేరి, రోషిని ప్రకాష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ మూవీకి దబ్బార శశిభూషన్ నాయుడు, రఘుకుంచే, శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్ డొంకాడ నిర్మాతలు..గ్రిప్పింగ్ నేరేషన్ తో సాగే ఈ కథ ప్రేక్షకుల్ని ఆద్యాంతం థ్రిల్ చేస్తుందని చిత్ర యూనిట్ అంటుంది.
షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకొన్న ఈమూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.. గోవా, వైజాగ్, అరకు, లక్నవరంఅండ్ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ లో బిగ్ బాస్ హరితేజ, రవివర్మ, శ్రీకాంత్ అయ్యంగార్,ఇర్ఫాన్, బేబి అక్షర, ముక్తార్ ఖాన్, సత్య ప్రకాష్, కిరీటి, అశోక్ కుమార్, తదితరులు నటిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.."దసరా రోజు మేం రిలీజ్ చేసిన ప్రీ లుక్ కు ఇండస్ట్రీ నుంచి,ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.. ఇప్పుడు రిలీజ్ చేస్తున్న ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాం.ఏదైనా కొత్త దనం లేనిదే ప్రేక్షకులు చిన్న సినిమాలను ఆదరించడం లేదు. అందుకే " 47 డేస్" లో కంటెంట్ బలంతోనే ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం..యంగ్ అండ్ టాలెంటెడ్ టెక్నికల్ టీం సహాయంతో ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాము..త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేస్తాం" అన్నారు.
నటీనటులు:
సత్యదేవ్, పూజా ఝావేరి, రోషిణి, రవి వర్మ,బిగ్ బాస్ హరితేజ,ఇర్ఫాన్, బేబి అక్షర,శ్రీకాంత్ అయ్యంగార్, ముక్తార్ ఖాన్, సత్య ప్రకాష్, కిరీటి, అశోక్ కుమార్,
సాంకేతక వర్గం:
పబ్లిసిటీ డిజైనర్స్: అనీల్ భాను, స్క్రిప్ట్ అసిస్టెంట్స్ : కిరణ్ కట్టా, హరీష్ సజ్జా,ఫస్ట్ఎడి:రాజ్ కుమార్ కోసన, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: నానాజి పెట్లా,పిఆర్వో: సురేష్ కుమార్, పబ్లిసిటీ ఇన్ ఛార్జ్: విశ్వ సియమ్, లిరిక్స్: భాస్కర్ బట్ల, లక్ష్మీ భూపాల్,విశ్వ,కొరియోగ్రఫీ: నిక్సన్ డిక్రూజ్, స్టంట్స్: స్టంట్స్ శ్రీ, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మకడలి, ఎడిటర్: ఎస్.ఆర్. శేఖర్, మ్యూజిక్: రఘుకుంచే. సినిమాటోగ్రఫీ: జీకె
కో ప్రొడ్యూసర్ : అనిల్ కుమార్ సోహని, నిర్మాతలు: దబ్బార శశిభూషన్ నాయుడు, రఘుకుంచే , శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్ డొంకాడ, కథ,కథనం,మాటలు,దర్శకత్వం : ప్రదీప్ మద్దాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout