ఏపీలో 400 మార్క్‌ను దాటేసిన కరోనా కేసులు

  • IndiaGlitz, [Thursday,June 18 2020]

ఆంధ్రప్రదేశ్‌లో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మొన్నటి వరకూ 200 మార్క్ దాటని కరోనా కేసులు.. నిన్న 350కి పైగా నమోదవగా.. నేడు ఏకంగా 425 కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు షాకవుతున్నారు. గడిచిన 24 గంటల్లో 13,923 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా.. 425 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దీనిలో 299 కేసులు రాష్ట్రానికి చెందినవి కాగా.. ఇతర రాష్ట్రాల వచ్చిన 100 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విదేశాల నుంచి వచ్చిన మరో 26 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7496కు చేరుకుంది. నేడు కొత్తగా మరో రెండు కరోనా మరణాలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు బాధితులు కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 92కు చేరుకుంది.

More News

పూన‌మ్ సెన్సేషనల్ ట్వీట్స్.. టార్గెట్ ఎవరు?

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య నేప‌థ్యంలో ద‌క్షిణాదిన కూడా ప్ర‌కంప‌న‌లు మొద‌ల‌య్యాయి.

రీ రికార్డింగ్ దశలో యాక్షన్ అండ్ సోషియో థ్రిల్లర్ మూవీ  'క్లూ'

నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని రిలీజ్ కు సిద్ధమవుతున్న తరుణంలో కరోనా సంక్షోభం ఏర్పడటంతో వందలాది చిత్రాల విడుదల  విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది.

పూరి స్క్రిప్ట్ చేంజ‌స్ చేస్తున్నాడా?

పూరి కొన్ని విష‌యాల్లో చాలా నిక్క‌చ్చిగా ఉంటాడు. ఒక‌సారి స్క్రిప్ట్ లాక్ అయిన త‌ర్వాత మార్పులంటే ఎవ‌రు చెప్పినా విన‌డు.

నెపోటిజంకు వ‌ర్మ మ‌ద్ద‌తు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్యతో బాలీవుడ్ వ‌ర్గాలు షాక్ అయ్యాయి.

డిజిటల్‌లో ‘ల‌క్ష్మీబాంబ్’ డేట్ ఫిక్స‌య్యిందా?

క‌రోనా ఎఫెక్ట్‌తో సినిమా ప‌రిశ్ర‌మ‌కు గ‌డ్డుకాలం న‌డుస్తుంద‌నే చెప్పాలి. థియేట‌ర్స్ మూత ప‌డ‌టంతో సినిమాలు రిలీజ్‌లు ఆగిపోయాయి.