ఏపీలో 400 మార్క్‌ను దాటేసిన కరోనా కేసులు
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌లో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మొన్నటి వరకూ 200 మార్క్ దాటని కరోనా కేసులు.. నిన్న 350కి పైగా నమోదవగా.. నేడు ఏకంగా 425 కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు షాకవుతున్నారు. గడిచిన 24 గంటల్లో 13,923 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా.. 425 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
దీనిలో 299 కేసులు రాష్ట్రానికి చెందినవి కాగా.. ఇతర రాష్ట్రాల వచ్చిన 100 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విదేశాల నుంచి వచ్చిన మరో 26 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7496కు చేరుకుంది. నేడు కొత్తగా మరో రెండు కరోనా మరణాలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు బాధితులు కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 92కు చేరుకుంది.
#COVIDUpdates: 18/06/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) June 18, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 5854 పాజిటివ్ కేసు లకు గాను
*2983 మంది డిశ్చార్జ్ కాగా
*92 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2779#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/8fk15mO8Kg
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout