400 కిలోల బంగారంతో...
Send us your feedback to audioarticles@vaarta.com
సంజయ్ లీలా బన్సాలీ మూవీ మేకింగ్ అంటే..గ్రాండియర్‌గా ఉంటుంది. ఆ విషయం ఆయన సినిమాలను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడు సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కిస్తోన్న చిత్రం `పద్మావతి`.
రాజపుత్ర మహారాణి పద్మావతిగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె నటిస్తుంటే, షాహిద్ కపూర్ పద్మావతి భర్త మహారావల్ రతన్ సింగ్ పాత్రలో, రణ్వీర్ సింగ్ సుల్తాన్ అల్లా ఉద్దీన్ ఖిల్జీ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు, కాస్ట్యూమ్స్ అల్టిమేట్‌గా ఉన్నాయని అందరూ ప్రశంసిస్తున్నారు.
సినిమా 13వ శతాబ్దానికి చెందిన కథాంశం కావడంతో..ఆభరణాల విషయంలో దర్శకుడు సంజయ్ స్పెషల్ కేర్ తీసుకున్నాడట. అందుకోసమని 400 కిలోల బంగారం ఉపయోగించారట. ఆభరణాల తయారీ కోసం 200 వర్కర్స్ 600 రోజలు పనిచేశారని యూనిట్ వర్గాలు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments