అత్తారింటికి దారేది @ 4
Send us your feedback to audioarticles@vaarta.com
ఖుషి తరువాత సరైన హిట్ లేని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి మళ్లీ విజయాన్ని అందించింది జల్సా చిత్రమే. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. అలాంటి ఈ హిట్ కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రం అత్తారింటికి దారేది.. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసుకుంది. విడుదలకి ముందే సినిమా లీక్ అయినా.. ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే కంటెంట్ ఉండడం సినిమాకి ప్లస్ అయ్యింది. అదే ఈ సినిమాన్ని ఇండస్ట్రీ హిట్‌గా నిలిపింది.
జల్సాకి అదరగొట్టే ఆడియో ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి కూడా మంచి బాణీలు ఇచ్చారు. పలు అవార్డులతో పాటు తొలిసారిగా నంది అవార్డుని కూడా తన సంగీతానికి సొంతం చేసుకున్నారాయన. సమంత, ప్రణీత కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో పవన్‌కి అత్తగా నదియా నటించగా.. ఇతర పాత్రల్లో బొమన్ ఇరాని, ముఖేష్ రుషి, అలీ, బ్రహ్మానందం, రావు రమేష్ తదితరులు నటించారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 27, 2013న విడుదలైంది. అంటే.. నేటితో ఈ సినిమా నాలుగు సంవత్సరాలను పూర్తిచేసుకుంటోందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments