వెంకీ కోసం 4 టైటిల్స్...

  • IndiaGlitz, [Wednesday,December 02 2015]

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ వంశీ నిర్మిస్తున్నారు. వెంకీ స‌ర‌స‌న ఈ చిత్రంలో అందాల తార న‌య‌న‌తార న‌టిస్తుంది. గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

డిసెంబ‌ర్ 16న ఈ చిత్రాన్ని ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి రాధాక్రిష్ణ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కానీ రాధాక్రిష్ణ టైటిల్ ను ప‌క్క‌న పెట్టేసార‌ట‌. తాజాగా....బాబు బంగారం, డైమాండ్ రాజా, రాజా ర‌త్నం, 24 క్యారెట్ బంగారం...ఈ నాలుగు టైటిల్స్ ను ప‌రిశీలిస్తున్నార‌ట‌. ఈ నాలుగింటిలో బాబు బంగారం, డైమాండ్ రాజా ఈ రెండు టైటిల్స్ లో ఒక‌టి ఫైన‌ల్ చేస్తార‌ట‌. త్వ‌ర‌లోనే టైటిల్ విష‌యంలో క్లారిటీ వ‌స్తుంద‌ని స‌మాచారం.

More News

త్రిష మ్యాజిక్ రిపీట్ చేస్తుందా?

మూడు పదుల వయసు దాటిన తర్వాత త్రిష కూడా త్రిష మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'బెంగాల్ టైగర్'

'బలుపు','పవర్ ' వంటి వరుస సూపర్ హిట్ చిత్రాల తరువాత మాస్ మహరాజ్ రవితేజ హీరోగా,తమన్నా,రాశి ఖన్నా హీరోయిన్స్ గా,రచ్చ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బెంగాల్ టైగర్'.

సూపర్ స్టార్ గొప్ప మనసు

అకాల వర్షాలతో చెన్నై అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే.తమిళనాడులోని పలు చోట్ల పడుతున్న వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమై కనిపిస్తున్నాయి.

99 వెహికిల్స్ పై బాలయ్య ఫ్యాన్స్...

నందమూరి నట సింహంబాలక్రిష్ణ నటిస్తున్న 99వ సినిమా డిక్టేటర్.ఈ చిత్రాన్నిశ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు.ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ డైరెక్టర్ శ్రీవాస్ తో కలసి ఈ చిత్రాన్నినిర్మిస్తుంది.

7న వ‌రుణ్ నిశ్చితార్థం

హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన హీరో వ‌రుణ్ సందేశ్‌. ఆ త‌ర్వాత కొత్త‌బంగారులోకం ఆయ‌న‌కు కెరీర్‌లో చాలా పెద్ద హిట్.