భారత్‌లో విజృంభిస్తున్న కరోనా.. వారానికి 4 లక్షల చొప్పున పాజిటివ్ కేసులు
Send us your feedback to audioarticles@vaarta.com
భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా ఆగస్టు నెలలో దేశ వ్యాప్తంగా వైరస్ తీవ్రత భారీగా పెరిగిందన్నారు. వారానికి 4 లక్షల చొప్పున పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. కాగా.. గడిచిన వారం రోజుల్లో కేసుల సంఖ్య 4.5 లక్షలు నమోదవగా.. 6600 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ గడిచిన 24 గంటల్లో కొత్తగా 61,408 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య 31,06,348కు చేరుకుంది.
నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా 836 మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 57,542కు చేరుకుంది. అయితే దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటే కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగడం విశేషం. నిన్న ఒక్కరోజే 57 వేల మంది కరోనా నుంచి కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 6 లక్షల శాంపిళ్లను పరీక్షించగా.. ఇప్పటి వరకూ దేశంలో 3 కోట్ల 59 లక్షల శాంపిళ్లను పరీక్షించినట్టు కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ వెల్లడించింది.
కాగా.. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 23 లక్షల 38 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో ఇంకా 7లక్షల యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 75 శాతానికి చేరుకుందని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసుల శాతం 23.4 ఉండగా.. మరణాల రేటు 1.86 శాతం ఉంది. ప్రస్తుతం కరోనా కేసుల పాజిటివిటీ రేటు 8.6 శాతంగా ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout