హైదరాబాద్‌లో ఒకే స్కూలులోని 38 మంది విద్యార్థినులకు కరోనా
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా పాఠశాలల్లో ఈ మహమ్మారి తన విశ్వరూపం చూపిస్తోంది. కరోనా సమయంలో పాఠశాలలు తెరవడం.. చిన్నారులకు పెద్దగా అవగాహన లేకపోవడంతో అదుపులోకి వచ్చిందనుకున్న కరోనా మరోసారి విజృంభిస్తోంది. మంగళవారం హైదరాబాద్ శివారు నాగోల్‌లోని బండ్లగూడలో కరోనా కల్లోలం రేపింది. బాలికల మైనార్టీ పాఠశాలలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 38 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాగా.. ఈ పాఠశాలలో మొత్తం 160 మంది విద్యార్థినులు చదువుతున్నారు.
వెంటనే అప్రమత్తమైన అధికారులు విద్యార్థినులు, సిబ్బంది అందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసులు పెరిగితే అందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు కరోనా అదుపులోకి వచ్చేసిందనుకున్న అనంతరం రోజు రోజుకూ గాంధీ ఆస్పత్రిలోనూ కరోనా కేసులు పెరుగుతుండటం గమనార్హం. కాగా.. సోమవారం కరీంనగర్‌లో సైతం నలుగురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే మంచిర్యాలలో 15 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. హాస్టల్ వార్డెన్‌తో పాటు పలువురు టీచర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout