షాకింగ్.. ఏపీలో ఇవాళ ఒక్కరోజే 37 మంది మృతి

  • IndiaGlitz, [Monday,July 13 2020]

ఏపీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో కరోనా కారణంగా 37 మంది మృతి చెందడం షాక్‌కు గురి చేస్తోంది. ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో ఇదే అధికమని చెప్పాలి. కాగా సోమవారం 19,247 శాంపిల్స్‌ను పరిశీలించగా.. 1935 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1919 మంది ఏపీకి చెందిన వారు కరోనా బారిన పడగా.. 13 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు.. ముగ్గురు విదేశాలకు చెందిన వారు కరోనా బారిన పడ్డారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 31,103కి చేరింది.

ఇవాళ ఒక్కరోజే కరోనా నుంచి కోలుకుని 1030 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 14,274 యాక్టివ్ కేసులున్నాయి. అయితే కరోనా కారణంగా అనంతపూర్‌లో ఆరుగురు, కర్నూలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో నలుగురు చొప్పున, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, కడప, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.