‘జర్నీ’ మూవీలో లాగా ఘోర ప్రమాదం.. 36 మందికి తీవ్రగాయాలు

  • IndiaGlitz, [Wednesday,January 08 2020]

‘జర్నీ’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది కదూ.. ఈ సినిమా ఒక్కసారి చూస్తే చాలు కనెక్ట్ అయిపోతుంది. మరీ ముఖ్యంగా బస్సు ప్రమాదం సీన్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అయితే జర్నీలో జరిగిన బస్సు ప్రమాదం ఘటనే ఇప్పుడు.. చిత్తూరు జిల్లాలో రిపీట్ అయ్యింది. జిల్లాలోని కాశింపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున విజయవాడ నుంచి కుప్పం వెళ్తున్న వోల్వో బస్సు-ఆర్టీసీ బస్సు పరస్పరం ఢీకొన్నాయి. నెల్లూరు - పూతలపట్టు రహదారిపై కాశిపెంట్ల వద్ద జరిగిన ఈ ఘోర ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 36 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారంతా అయ్యప్ప మాల ధరించినవారే.!. ఒకరు తీవ్ర గాయాలతో మరణించారు.

కాగా.. గాయపడిన వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన జరిగిందని తెలుసుకున్న క్షతగాత్రుల కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది..? ప్రమాదానికి కారణమెవరు..? అనే విషయాలు తెలియాల్సి ఉంది.