3డి ఆడియో ఆహ్వానం
Send us your feedback to audioarticles@vaarta.com
మీడియా వన్ గ్లోబల్ ఎంటర్ టైన్ మెంట్ లిమెటెడ్ బ్యానర్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కతున్న సినిమా 'విక్రమసింహా'(తమిళంలో 'కొచ్చడయాన్'). బాలీవుడ్ బ్యూటీ దీపికాపదుకొనే హీరోయిన్. రజనీకాంత్ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సునీల్ లుల్లా, సునంద మురళి మనోహర్ లు నిర్మిస్తున్నారు.
ఇండియాలో మోషన్ క్యాప్చర్ లో తెరకెక్కిన త్రిడి సినిమాగా ఇప్పటికే రికార్డ్ కెక్కింది. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఈ నెల 9న తెలుగు, తమిళం, హిందీలో చెన్నై సత్యంలో విడుదల కానుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాజ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు.
ఈ ఆడియో వేడుక కోసం 800 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వనిస్తున్నారని సమాచారం. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ అతిథుల లిస్టు రెఢీ అయ్యిందని, వీరందిరకి 3డి ఆడియో ఆహ్వానం అందనుందట. ఈ ఆహ్వానం 3డి రజనీకాంత్ పోస్టర్ తో కవర్ చేయబడి ఉందట. వీటిని చైనాలో తయారుచేశారట. ఈ ఆహ్వాన పత్రికలు ఇప్పటికే పంపడం జరగిందని సమాచారం. అది ఆడియో వేడుకైనా, సినిమా అయినా ఏదైనా రజనీకాంత్ అంటేనే రికార్డ్.
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments