చిరంజీవి 'ఖైదీ'కి 32 ఏళ్లు
- IndiaGlitz, [Wednesday,October 28 2015]
'పగ కోసం ఈ జన్మ ఎత్తాను. ప్రేమ కోసం మరో జన్మ ఎత్తుతాను'.. ఇదీ 'ఖైదీ' సినిమాలో హీరోయిన్‌తో హీరో చెప్పే డైలాగ్. ఈ ఒక్క డైలాగ్‌లోనే సినిమా సారాంశం ఉంది. పగ ప్రతీకారం నేపథ్యంలో సాగే 'ఖైదీ' సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో టర్నింగ్ పాయింట్లా నిలిచింది.
'ఖైదీ' కి ముందు, తరువాత అన్నట్లుగా చిరు కెరీర్లో మెమరబుల్ మూవీగా నిలిచింది సదరు సినిమా. ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మాధవి, సుమలత హీరోయిన్లుగా నటించారు. చక్రవర్తి సంగీతంలో పాటలన్నీ సూపర్ హిట్టే. 'రగులుతోంది మొగలుపొద' అయితే సంచలనం సృష్టించింది. అక్టోబర్ 28, 1983న రిలీజైన 'ఖైదీ'.. నేటితో 32 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.