'హైద్రాబాద్ లవ్ స్టోరీ'
Send us your feedback to audioarticles@vaarta.com
ఎస్.ఎన్.ఆర్ ఫిల్మ్స్ ఇండియా ప్రై.లిమిటెడ్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా 'హైద్రాబాద్ లవ్ స్టోరీ'. రాహుల్, రేష్మీమీనన్, జియా హీరోహీరోయిన్లు. పద్మజ ఎస్ సమర్పణ. ఎస్.ఎన్.రెడ్డి నిర్మాత. రాజ్ సత్య దర్శకుడు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్స్ ఈరోజు విడుదలైంది. హైదరాబాద్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతానికి ఈ సినిమా చివరి షెడ్యూల్ లో ఉంది.
ఈ సినిమా ఆడియోను జనవరిలో, సినిమాని ఫిభ్రవరిలో విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. రావురమేష్, రమాప్రభ, తాగుబోతు రమేష్, షఫీ, సనా, సూర్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతంః సునీల్ కశ్యప్, కెమెరాః బివి. అమర్ నాథ్ రెడ్డి, కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వంః రాజ్ సత్య.
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments