'హార్ట్ ఎటాక్' సెన్సార్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ లో స్వీయ దర్శకనిర్మాణంలో రూపొందిన చిత్రం 'హార్ట్ ఎటాక్'. నితిన్, ఆదాశర్మ జంటగా నటించారు. ఇటీవల ఈ సినిమా సెన్సార్ పూర్తయ్యింది. జనవరి 31న సినిమా విడుదలకి సిద్ధమవుతుంది.
ఈ సందర్భంగా దర్శకనిర్మాత పూరిజగన్నాథ్ మాట్లాడుతూ 'మా 'హార్ట్ ఎటాక్' చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. 'ఎ 'సర్టిఫికేట్ పొందింది. ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా ఈ నెల 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇది యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందింది. ఇందులో నితిన్ సరికొత్త స్టైల్ లో కనిపించనున్నాడు. అనూప్ అద్భుతమైన సంగీతాన్నిచ్చాడు. అల్రెడీ మ్యూజిక్ హిట్టయ్యింది. ఈ సినిమా అందరినీ అలరిస్తుందని నమ్మకం ఉంది' అన్నారు.
ఈ సినిమాకి సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలుః భాస్కరభట్ల, కెమెరాః అమోల్ రాథోడ్, కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: పూరిజగన్నాథ్
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments