'హార్ట్ ఎటాక్' వాయిదా పడనుందా?

  • IndiaGlitz, [Wednesday,December 11 2013]

'ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే' వంటి రెండు వరుస విజయాల తరువాత నితిన్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం 'హార్ట్ ఎటాక్'. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ద్వారా ఆదా శర్మ హీరోయిన్ గా పరిచయం కానుంది. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశముందంటూ కథనాలు పుట్టుకొస్తున్నాయి.

ఇప్పటికే సంక్రాంతి బరిలో మహేష్ బాబు '1 నేనొక్కడినే', రామ్ చరణ్ 'ఎవడు' వంటి భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ ఉండడం. సింహ భాగం థియేటర్లలో ఆ సినిమా లే సందడి చేసే అవకాశం ఉండడంతో. 'హార్ట్ ఎటాక్' విడుదల తేదిపై చిత్రయూనిట్ కాస్తంత తీవ్రంగా ఆలోచిస్తోందని ఫిల్మ్ నగర్ వర్గాలు సంభాషించుకుంటున్నాయి. మరి ముందుగా అనుకున్నట్లుగానే 'హార్ట్ ఎటాక్' సంక్రాంతికే వస్తుందా? వాయిదా పడుతుందా? అనే విషయం స్ఫష్టతతో తేలాంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.