'విశ్వరూపం 2' తక్కువట!
Send us your feedback to audioarticles@vaarta.com
లోకనాయకుడు కమల్ హాసన్ కథానాయకుడుగా రూపొందిన చిత్రం 'విశ్వరూపం'. ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదలైన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయం సాధించింది. ఈ సినిమాకి సీక్వెల్ గా 'విశ్వరూపం 2' రూపొందుతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగంలో కమల్ హాసన్ తో కలిసి నటించిన పూజా కుమార్, ఆండ్రియాలు ఈ సినిమాలోనూ కనిపించనున్నారు. ఈ సినిమా సాంకేతికంగానూ అలరించేలా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే. తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం 'విశ్వరూపం 2' నిడివి తక్కువేనని తెలుస్తోంది. 'విశ్వరూపం' చిత్రం నిడివి 2 గంటల 20 నిమిషాలు ఉంటే. 'విశ్వరూపం 2' మాత్రం 2 గంటల కంటే తక్కువే ఉందని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. తొలి భాగంతో ప్రేక్షకుల, విమర్శకుల మన్ననలు పొందిన కమల్.. రెండో భాగంతోనూ దాన్ని కొనసాగిస్తాడని చిత్ర బృందం పేర్కొంటోంది. వచ్చే నెలలో గానీ జనవరిలో గానీ ఈ సినిమా విడుదలయ్యే అవకాశముంది.
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments