'లెజెండ్' సెన్సార్ పూర్తి...
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ హీరోగా ఈ శుక్రవారం విడుదలకు సిద్ధమవుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'లెజెండ్'. 'సింహా' వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బోయపాటి ఈ సినిమాని తెరకెక్కించడంతో అటు అభిమానుల్లో, ఇటు తెలుగు చిత్ర రంగంలో సినిమా అంచనాలు పెరిగాయి. నందమూరి అభిమానులు ఏంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. 24న సెన్సార్ పూర్తి కావాల్సిన ఈసినిమా కొన్ని అనివార్య కారణాల కారణంగా ఈ రోజు సెన్సార్ పూర్తి చేసుకుంది.
సెన్సార్ సభ్యులు చిత్రానికి ఎ సర్టిఫికేట్ ఇచ్చారని సమాచారం. సెన్సార్ కార్యక్రమాల్లో జాప్యం జరగడంతో నందమూరి అభిమానుల్లో సినిమా విడుదలపై ఒక రకమైన ఉత్కంఠత నెలకొంది. కానీ ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో ఈ నెల 28న విడుదల ఖాయమైంది. సో నందమూరి నటసింహా గర్జనకి బి రెడీ
Watch 'Legend' Trailers
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments