'లవర్స్' టీజర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
View Lovers Teaser Launch Gallery |
సుమంత్ ఆశ్విన్,నందిత హీరో హీరోయిన్స్ గా రూపొందుతోన్న సినిమా లవర్స్`. మారుతి టాకీస్, మాయ బజార్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి సూర్యదేవర నాగవంశీ, బి.మహేంద్రబాబు నిర్మాతలు. హరినాథ్ దర్శకుడు. జె.బి.సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో టీజర్ సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా విడుదలైంది. ఈ సందర్బంగా ..
మారుతి మాట్లాడుతూ `రెండు రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. జూలైన సమంత చేతుల మీదుగా ఆడియో విడుదల చేయాలనుకుంటున్నాం. ఆన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని ఆగస్టులో విడుదల చేయాలని అనుకుంటున్నాం. ఈ సినిమాకి స్ర్కీన్ ప్లే, మాటలు అందించాను. హరినాథ్ సినిమాని చక్కగా తెరకెక్కించాడు. జె.బి. మ్యూజిక్, జోషి ఫోటోగ్రఫీ సినిమాకి హైలైట్ అవుతాయి. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా సినిమాని నిర్మించారు. కొత్త లవ్ స్టోరి. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది`` అని తెలిపారు.
చిత్ర దర్శకుడు మాట్లాడుతూ `మారుతి , నిర్మాతల సహకారంతో సినిమాని అనుకున్నట్టుగా తెరకెక్కించాను. సహకరించిన వారందరికి థాంక్స్`` అన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, బి.మహేంద్రబాబు, వేమారెడ్డి, హరిపిక్చర్స్ హరి, సురేష్, వినోద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సుమంత్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేశారు.
Watch Lovers Trailers
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments