'లక్ష్యం' జంట మరోసారి..?
Send us your feedback to audioarticles@vaarta.com
2007లో విడుదల గోపిచంద్ 'లక్ష్యం' పెద్ద హిట్టయిన సంగతి తెలిసిందే. జగపతిబాబు ఇందులో కీలకపాత్ర పోషించాడు. ఈ సినిమాకి శ్రీవాస్ దర్శకుడు. ఈ సినిమా తర్వాత శ్రీవాస్ 'రామరామ కృష్ణ కృష్ణ', 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమాలు చేశాడు. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత మళ్లీ శ్రీవాస్ దర్శకత్వంలో గోపిచంద్ మరోసారి కలిసి నటింనున్నాడు.
ఈ సినిమాకి థమన్ సంగీత దర్శకుడి వ్యవహరిస్తాడనే టాక్. హీరోయిన్ ఇంకా ఎవరనేది తేలలేదు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లోనే ఈ సినిమా తెరకెక్కనుంది.ప్రస్తుతం గోపిచంద్ బి.గోపాల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తికావస్తుంది. ఈ సినిమా పూర్తైన తర్వాత అంటే దాదాపు ఏప్రిల్ రెండోవారంలో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని టాక్.
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments