'రౌడీ' ఎవరు..?

  • IndiaGlitz, [Wednesday,February 05 2014]

లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ లో క్రియేటివ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా పేరు 'ఒట్టు', 'అన్నగారు', 'సీమలెక్క 'అని చాలా పేర్లు వినిపించినప్పటికీ 'రౌడీ' అనే టైటిల్ నే కన్ ఫర్మ్ చేసినట్లు సమాచారం.

మంచు మోహన్ బాబు 'అసెంబ్లీరౌడీ', 'రౌడీగారి పెళ్లాం' సినిమాలు పెద్ద సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. మరి ఈసారి ఈ 'రౌడీ' వారికి ఏ మేర కలిసి వస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 80 శాతం పైగా పూర్తైనట్లు సమాచారం.