'రేసుగుర్రం'లోనూ ఉందట

  • IndiaGlitz, [Saturday,December 07 2013]

కథానాయకుడు అల్లు అర్జున్, దర్శకుడు సురేందర్ రెడ్డి తొలి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'రేసు గుర్రం'. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. దర్శకుడు సురేందర్ రెడ్డి పుట్టినరోజుని పురస్కరించుకుని శనివారం (డిసెంబర్ 7) విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కి మంచి స్పందన లభిస్తోంది. స్టైలీష్ లుక్స్ తో మరోసారి స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ యువతని కట్టిపడేసాడని ఫిల్మ్ నగర్ వాసులు ఈ టీజర్ గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కి తగ్గట్టుగానే ఈ సినిమాలోనూ ఓ విషయాన్ని చొప్పించనున్నారని కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. అదేమిటంటే.. 'రేసుగుర్రం'లో అరేబియన్ గుర్రం లాంటి హీరోయిన్ తో ఓ స్పెషల్ సాంగ్ ని షూట్ చేసే దిశగా చిత్రయూనిట్ యోచిస్తోందట. కథ డిమాండ్ మేరకు.. సన్నివేశ బలం రీత్యా సదరు ఐటం సాంగ్ ఉండేలా చిత్రబృందం ప్రణాళిక రచిస్తోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.