'రేసుగుర్రం' లోనూ అంతేనా!
- IndiaGlitz, [Monday,September 09 2013]
'ధన 51' సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సలోని. ఆ సినిమా ఆశించిన విజయం సాధించక పోయినా.. 'ఒక ఊరిలో', 'కోకిలÂ', 'చుక్కల్లో చంద్రుడు' వంటి వాటిలో అమ్మడు నాయికగా నటించింది. ఆ తరువాత ఊహించని రీతిలో రాజమౌళి దర్శకత్వంలో 'మర్యాద రామన్న' కోసం తెలుగమ్మాయి పాత్రలో నటించే అవకాశం పొంది ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చిన సలోని ఆ సినిమా తెచ్చిన గుర్తింపుని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యిందనే చెప్పుకోవాలి.
ఆ సినిమా తరువాత తాను హీరోయిన్ గా కంటే అతిథి పాత్రలకే పరిమితమైంది. వెంకటేష్ 'బాడీగార్డ్' లోనూ.. బాలకృష్ణ 'అధినాయకుడు' లోనూ సలోనికి ఆ తరహా క్యారెక్టర్ లే దక్కాయి. చిరు విరామం తరువాత సలోని ఓ పెద్ద సినిమాలో నటించే అవకాశాన్ని పొందింది. ఆ సినిమానే 'రేసు గుర్రం'. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకుడు. ఈ సినిమాలోనూ సలోనికి హీరోయిన్ కి తక్కువ.. అతిథి పాత్రకి ఎక్కువ అనదగ్గ వేషమే దక్కిందని వినిపిస్తోంది.
సురేందర్ సినిమాల్లో ఎక్కువగా ఒక హీరోయినే ఉంటుంది. ఒక వేళ రెండో నాయిక ఉన్నా అది జస్ట్ సైడ్ క్యారెక్టర్ లా ఉంటుంది. 'కిక్', 'ఊసరవెల్లి' చిత్రాల విషయంలో జరిగిందదే. ఈ మధ్యకాలంలో సలోని దక్కుతున్న ఆఫర్ల తీరు.. సురేందర్ రెడ్డి సినిమాల్లోని రెండో భామల తీరుని బట్టి Âరేసుగుర్రంÂ వల్ల సలోని కెరీర్ లో ఒక్కసారిగా మ్యాజిక్ జరిగే అవకాశం దాదాపుగా లేదేనే ఫిల్మ్ నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.