రాజ్ విరాట్, కిషోర్, గ్రేస్...'బీప్' షార్ట్ ఫిల్మ్ కు అద్భుతమైన స్పందన

  • IndiaGlitz, [Monday,February 13 2017]

కిషోర్ మారిశెట్టి, గ్రేస్ జంటగా నటించిన షార్ట్ ఫిల్మ్ బీప్. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది ఈ లఘు చిత్ర ట్రైలర్. చాలా చిత్రాలను తలదన్నే రీతిలో కట్ చేసిన ఈ ట్రైలర్ కు వస్తున్న స్పందనతో పూర్తి సినిమా ఎప్పుడు వస్తుందా అనే అంచనాలు భారీగా పెరిగాయి. అందరి అంచనాలకు ఫుల్ స్టాప్ పెడుతూ... బీప్ షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్ షో హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ ప్రీమియర్ షోకు పెళ్లి చూపులు చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి, ప్రముఖ నటులు నవీన్, రవి ప్రకాష్, చందు, అజయ్ తో పాటు ఆకతాయి చిత్ర దర్శకుడు రామ్ భీమన, అభినేత్రి చిత్ర మాటల రచయిత సత్య, కొరియోగ్రాఫర్ అమిత్ హాజరయ్యారు. వీరితో పాటు.. చిత్ర యూనిట్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరై చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియజేశారు.
నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.... దర్శకుడు సినిమాటిక్ బిల్డప్ ను బాగా క్రియేట్ చేశారు. షార్ట్ ఫిల్మ్స్ లోనే హై స్టాండర్స్ తో తెరకెక్కించారు. హీరో పెర్ ఫార్మెన్స్ చాలా బాగుంది. హీరోయిన్ ఆ క్యారెక్టర్ చేసేందుకు ధైర్యం కావాలి. చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్
హీరో కిషోర్ మారిశెట్టి మాట్లాడుతూ... చాలా కష్టపడి ఇష్టపడి చేశాం. ఈ సినిమాకు వర్క్ చేసిన వారందరిలో మంచి టాలెంట్ ఉంది. మాకున్న లిమిటెడ్ బడ్జెట్ లో... లిమిటెడ్ రిసోర్స్ తో ఈ సినిమా తీశాం. దర్శకుడు రాజ్ కి అద్భుతమైన టాలెంట్ ఉంది. గ్రేస్ తప్ప మరెవ్వరూ హీరోయిన్ క్యారెక్టర్ చేసేందుకు ఒప్పుకునే వారు కారేమో. సినిమాకు మ్యూజిక్, కెమెరా ప్రాణంగా నిలిచాయి. అన్ని డిపార్ట్ మెంట్స్ సమిష్టిగా పనిచేశాం కాబట్టే షార్ట్ ఫిల్మ్ ఇంత బాగా వచ్చింది.
దర్శకుడు రాజ్ విరాట్ - నేను దర్శకుడిని కావాలనే ప్రయత్నంలో చేసిన షార్ట్ ఫిల్మ్ ఇది. కథ కంటే కూడా... నేను ఇలా తీయగలనని చూపించుకునేందుకే కాన్ సన్ ట్రేట్ చేశాం. మీ అందరికీ నచ్చినందుకు చాలా థాంక్స్, నేను ఎలా కావాలనుకున్నానో అలా వచ్చిందంటే కారణం ఆర్టిస్టుల టెక్నీషియన్స్ సపోర్ట్ వల్లే సాధ్యమైంది.
హీరోయిన్ గ్రేస్ మాట్లాడుతూ... ముందుకు దర్శకుడు రాజ్ కి చాలా థాంక్స్, హీ ఈజ్ ది బెస్ట్. నా బెస్ట్ కో స్టార్ కిషోర్. నేను ఇలా చేయగలనని నాకే తెలియదు. షార్ట్ ఫిల్మ్ ని నచ్చి ప్రోత్సహిస్తున్న అందరికీ చాలా థాంక్స్.
దర్శకుడు రామ్ భీమన మాట్లాడుతూ... ఫారిన్ ఫిల్మ్ చూసిన ఫిల్మ్ కలిగింది. ఎడిటింగ్ చాలా అద్భుతంగా ఉంది. బీప్ లో ఒకరికి ఒకరు పోటీ పడుతూ చేశారు. కిషోర్ నాకు బ్రదర్ లాంటి వాడు. ఆకతాయి సినిమాలో కూడా చేశాడు. చాలా బాగా చేశాడు. బ్రిలియంట్ యాక్టర్. డైరెక్షన్ ఫారిన్ ఫిల్మ్ చూసినట్టుగా ఉంది. చైతు, గ్రేస్ చాలా బాగా చేశారు. పెద్ద సినిమా చేసిన ఫీలింగ్ కలిగింది. ఇదే ప్యాటర్స్ లో సినిమా చేస్తే కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది.
కొరియోగ్రఫర్ అమిత్ - మ్యూజిక్ అండ్ ఎడిటింగ్ చాలా బాగుంది. గ్రేస్, చైతు అద్భుతంగా చేశారు. కిషోర్ హీరోగా పెద్ద సినిమా చేయాలని కోరుకుంటున్నాను.
నటుడు నవీన్ మాట్లాడుతూ... హీరోయిన్ ను చూస్తే భయమైంది. టీం అంతా చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్ టు ది టీం బీప్.
నటుడు రవి ప్రకాష్ మాట్లాడుతూ... బీప్ షార్ట్ ఫిల్మ్ లా కాకుండా సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. కిషోర్ తో పాటు ఆర్టిస్టులంతా చాలాబాగా చేశారు. డైరెక్టర్ కి మంచి ఫ్యూచర్ ఉంది. అని అన్నారు.
నటీనటులు - కిషోర్ మారిశెట్టి, గ్రేస్, చైతు సోఫి, జయసింహ సన్నీ ఈదర, హరీష్ రోషన్, లీలా వెంకటేష్ కొమ్మురి, శ్రీ కృష్ణ