రంగంరేంజ్ లో విజయం సాధించే చిత్రం రంగం 2 - విజయ్ దేవరకొండ
Monday, November 21, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
రంగం` ఫేమ్ జీవా కథానాయకుడిగా నటించిన రంగం-2` ఈ నెల 25న విడుదలవుతోంది. జస్‌రాజ్ ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రీ లక్ష్మీజ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఎ.యన్.బాలాజీ (సూపర్‌గుడ్ బాలాజీ) నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి కె.చంద్రన్ దర్శకత్వం వహించారు. రంగం`లో నిన్నటి మేటి కథానాయకి రాధ పెద్ద కుమార్తె కార్తీక హీరోయిన్‌గా నటించగా..రంగం-2`లో రాధ చిన్న కుమార్తె తులసీనాయర్ జీవాతో జత కట్టింది. రంగం` చిత్రానికి సంగీత సారథ్యం వహించి, ఆ చిత్రం సాధించిన సంచలన విజయంలో సముచిత పాత్ర పోషించిన హేరిస్ జైరాజ్ రంగం`2` చిత్రానికి కూడా సంగీతం సమకూర్చడం విశేషం.
ఈ నెల 25న రంగం`2` ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా.. ఫిలిం చాంబర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో చిత్ర నిర్మాత ఎ.యన్.బాలాజీ, ప్రముఖ నిర్మాత కె.వి.వి.సత్యనారాయణ, ప్రముఖ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, సముద్ర, యువ నిర్మాత భరత్ చౌదరి, పెళ్ళిచూపులు` హీరో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు.
రంగం-2`తో నిర్మాతగా మారుతున్న ఎ.యన్.బాలాజీ తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయాలని విజయ్ దేవరకొండ అన్నారు.
జీవా పెర్ఫార్మెన్న్, తుసీనాయర్ గ్లామర్, హేరిస్‌రాజ్ సంగీతం రవి కె చంద్రన్ దర్శకత్వం రంగం`2` చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని.. గ్లామర్ ఓరియెంటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌ను ఇష్టపడేవారిని రంగం-2` అమితంగా అరిస్తుందని నిర్మాత బాలాజీ తెలిపారు.భారీ బడ్జెట్‌తో, టాప్ టెక్నీషియన్స్‌తో రూపొంది, తమిళంలో మంచి విజయం సాధించిన రంగం`2` తెలుగులోనూ ఘన విజయం సాధించడం ఖాయమని అతిథులంతా అభిలషించారు.
ఈ చిత్రానికి మాటలు, పాటలు: శశాంక్ వెన్నెలకంటి, కెమెరా: మనుష్ నందన్, ఎడిటర్: ఎ.శ్రీకర్ ప్రసాద్, సంగీతం: హేరిస్ జైరాజ్, నిర్మాత: ఏ.యన్.బాలాజి, దర్శకత్వం: రవి కె. చంద్రన్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments