రంగంరేంజ్ లో విజయం సాధించే చిత్రం రంగం 2 - విజయ్ దేవరకొండ

  • IndiaGlitz, [Monday,November 21 2016]

రంగం' ఫేమ్‌ జీవా కథానాయకుడిగా నటించిన రంగం-2' ఈ నెల 25న విడుదలవుతోంది. జస్‌రాజ్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో శ్రీ లక్ష్మీజ్యోతి క్రియేషన్స్‌ పతాకంపై ఎ.యన్‌.బాలాజీ (సూపర్‌గుడ్‌ బాలాజీ) నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి కె.చంద్రన్‌ దర్శకత్వం వహించారు. రంగం'లో నిన్నటి మేటి కథానాయకి రాధ పెద్ద కుమార్తె కార్తీక హీరోయిన్‌గా నటించగా..రంగం-2'లో రాధ చిన్న కుమార్తె తులసీనాయర్‌ జీవాతో జత కట్టింది. రంగం' చిత్రానికి సంగీత సారథ్యం వహించి, ఆ చిత్రం సాధించిన సంచలన విజయంలో సముచిత పాత్ర పోషించిన హేరిస్‌ జైరాజ్‌ రంగం'2' చిత్రానికి కూడా సంగీతం సమకూర్చడం విశేషం.
ఈ నెల 25న రంగం'2' ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా.. ఫిలిం చాంబర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో చిత్ర నిర్మాత ఎ.యన్‌.బాలాజీ, ప్రముఖ నిర్మాత కె.వి.వి.సత్యనారాయణ, ప్రముఖ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, సముద్ర, యువ నిర్మాత భరత్‌ చౌదరి, పెళ్ళిచూపులు' హీరో విజయ్‌ దేవరకొండ పాల్గొన్నారు.
రంగం-2'తో నిర్మాతగా మారుతున్న ఎ.యన్‌.బాలాజీ తెలుగులో స్ట్రెయిట్‌ సినిమా చేయాలని విజయ్‌ దేవరకొండ అన్నారు.
జీవా పెర్ఫార్మెన్న్‌, తుసీనాయర్‌ గ్లామర్‌, హేరిస్‌రాజ్‌ సంగీతం రవి కె చంద్రన్‌ దర్శకత్వం రంగం'2' చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని.. గ్లామర్‌ ఓరియెంటెడ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌ను ఇష్టపడేవారిని రంగం-2' అమితంగా అరిస్తుందని నిర్మాత బాలాజీ తెలిపారు.భారీ బడ్జెట్‌తో, టాప్‌ టెక్నీషియన్స్‌తో రూపొంది, తమిళంలో మంచి విజయం సాధించిన రంగం'2' తెలుగులోనూ ఘన విజయం సాధించడం ఖాయమని అతిథులంతా అభిలషించారు.
ఈ చిత్రానికి మాటలు, పాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, కెమెరా: మనుష్‌ నందన్‌, ఎడిటర్‌: ఎ.శ్రీకర్‌ ప్రసాద్‌, సంగీతం: హేరిస్‌ జైరాజ్‌, నిర్మాత: ఏ.యన్‌.బాలాజి, దర్శకత్వం: రవి కె. చంద్రన్‌

More News

రాయలసీమ వరకు పవన్ కు నా మద్దతు - సీనియర్ నటుడు నరేష్

కామెడీ చిత్రాల కథానాయకుడుగా...ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ లో నటించి...నేడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న సీనియర్ నటుడు నరేష్. నిత్యామీనన్ ప్రధాన పాత్రలో శ్రీప్రియ తెరకెక్కించిన విభిన్న కథా చిత్రం ఘటన.

సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ ల '2.0' ఫస్ట్ లుక్ లాంచ్

సూపర్స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ అదే కాంబినేషన్లో సుభాష్ కరణ్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న సైన్స్ ఫిక్షన్ '2.0'. 350 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ను ఆదివారం ముంబాయిలోని యశ్రాజ్ స్టూడియోలో పలువురు సినీ ప్రముఖĹ

డిసెంబర్ 1న విజయ్ ఆంటోని 'బేతాళుడు' విడుదల

విజయ్ ఆంటోని'కధానాయకునిగా తమిళంలో రూపొందుతున్న 'సైతాన్ ' చిత్రం తెలుగు నాట 'బేతాళుడు' గా డిసెంబర్ 1 పలకరించబోతోంది.

బన్ని హీరోయిన్ ఫిక్సయ్యింది...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,తమిళ దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్ లో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.

చరణ్ సిక్స్ ప్యాక్....

బన్ని,ఎన్టీఆర్,కల్యాణ్ రామ్ ఇలా యంగ్ జనరేషన్ హీరోలందరూ సిక్స్ ప్యాక్ తో అభిమానులను ఆకట్టుకున్నారు.