మరోసారి మాయ చేయనున్న జంట...
Tuesday, March 8, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మరోసారి మాయ చేయనున్న జంట...అనగానే ఆ జంట ఎవరో ఇప్పటికే తెలిసి ఉంటుంది. అవును...చైతన్య..సమంత. ఏమాయ చేసావే...చిత్రంలో తొలిసారి కలసి నటించిన ఈ జంట ప్రేక్షకులను నిజంగానే మాయ చేసారు. ఆతర్వాత అక్కినేని త్రయం కలసి నటించిన మనం చిత్రంలో మరోసారి చైతు, సామ్ కలసి నటించారు.
రెండోసారి కూడా ఈ జంట మాయ చేసి ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. ఏ మాయ చేసావే, మనం...చిత్రాల తర్వాత చైతు, సామ్ కలసి ఆటోనగర్ సూర్య సినిమాలో నటించారు. ఈ సినిమా ఆశించిన స్ధాయిలో ఆడకపోయినా ఈ జంట మాత్రం ఆకట్టుకుంది. ఇప్పుడు నాలుగోసారి చైతు, సామ్ కలసి నటించేందుకు రెడీ అవుతున్నారు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంతో బ్లాక్ బష్టర్ ని సొంతం చేసుకున్న డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తన రెండో చిత్రాన్ని నాగ చైతన్యతో చేస్తున్నాడు. ఈ చిత్రంలో చైతు సరసన సమంతను సెలెక్ట్ చేసినట్టు సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించే ఈ చిత్రాన్ని త్వరలో ప్రారంభించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments