'మనం' లాంటి సినిమా చేయడం కష్టం
Send us your feedback to audioarticles@vaarta.com
View Nagarjuna Gallery |
అక్కినేని ఫ్యామిలీ చిత్రంమనంఇటీవల విడుదలై ఘన విజయం సాధించడమే కాకుండా కలెక్షన్స్ పరంగా అక్కినేని హీరోలకు ట్రేడ్ మార్క్ సినిమాగా నిలుస్తుంది. ఈ సినిమా సాధించిన సక్సెస్ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో అక్కినేని నాగార్జున మాట్లాడుతూసినిమా విజయం సాధించినందుకు ఒకపక్క మా ఫ్యామిలీ హ్యపీగా ఉన్నా, ఇంత పెద్ద సక్సెస్ ను మాకందించిన నాన్నగారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధగా ఉంది. అందుకనే ఇంత పెద్ద సక్సెస్ ను సరిగా ఎంజాయ్ చేయలేకపోతున్నాం.
నా గత చిత్రాలు అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేదు. దాంతో నా డిసిషన్ మేకింగ్ ఏదో సమస్య ఉందంటూ నాన్నగారితో అన్నాను. కానీ ఆయన నాకు ధైర్యం చెప్పారు. సినిమా విడుదలైన తర్వాత నాన్నగారికి మంచి చిత్రాన్ని కానుకగా ఇచ్చానని అన్నారు. కానీ నిజానికి ఆయనే మాకు సినిమా అంటే ఇలా తీయాలిరా అనేంత గొప్ప సినిమాని కానుకగా ఇచ్చారు. కమల్ హాసన్ సినిమా చూసిన తర్వాత రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి చాలా గొప్ప సినిమా తీశారని సినిమా కోసం ఏదైనా చేయాలా అని అడిగారు.
నాన్నగారితో తను అనుభవాలను నాతో చెప్పుకున్నారుకలెక్షన్స్ గురించి నేను ఆలోచించటం లేదు. కానీ మనం లాంటి సినిమాని మూడు తరాలతో నటులతో సినిమాని ఎవరు చేయలేరని కచ్చితంగా చెప్పగలను. ఈ సినిమాలో నాకు బిట్టు పాత్ర బాగా నచ్చింది. కానీ సీతా క్యారెక్టర్ బాగుంటుంది. పొయిటిక్ గా ఉంటుంది. నటన పరంగా చూస్తే చైతన్యకే ఫస్ట్ మార్కులు వేస్తాను.
Follow us on Google News and stay updated with the latest!
Comments