ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కొలంబస్ - హీరో సుమంత్ అశ్విన్
Send us your feedback to audioarticles@vaarta.com
తూనీగ తూనీగ, అంతకు ముందు ఆతర్వాత, లవర్స్,కేరింత..ఇలా యూత్ ఫుల్ మూవీస్ ఆకట్టుకుంటున్న యంగ్ హీరో సుమంత్ అశ్విన్. తాజాగా సుమంత్ అశ్విన్ కొలంబస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో సుమంత్ అశ్విన్ సరసన శీరత్ కఫూర్, మిస్టీ నటించారు. రమేష్ సామల ఈ మూవీని తెరకెక్కించారు. దసరా కానుకగా ఈనెల 22న కొలంబస్ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కొలంబస్ గురించి హీరో సుమంత్ అశ్విన్ ఇంటర్ వ్యూ మీకోసం...
కొలంబస్ కాన్సెప్ట్ ఏమిటి..?
ఇది కొత్తగా ఉండే లవ్ స్టోరి. మనసంతా నువ్వే, నువ్వే కావాలి..లాంటి సినిమాలు ట్రైలర్ చూస్తే...అంతగా ఏమి అనిపించకపోవచ్చు. అదే సినిమా చూసాకా..ఆ ఫీలింగ్ నుంచి బయటకు రావడానికి టైం పడుతుంది.నేను కొలంబస్ సినిమా చూసాకా..నేను నటించానన్న విషయం మర్చిపోయి..ఆ మూడ్ లో రెండు మూడు గంటలు అలాగే ఉండిపోయాను. కొలంబస్ కాన్సెప్ట్ ఏమిటనేది ఇప్పుడు చెప్పడం కంటే తెరపై చూస్తేనే బాగుంటుంది.
కొలంబస్ టైటిల్ వెరైటీగా ఉంది..? ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటి..?
అమెరికాకి, మా సినిమాకి ఎలాంటి సంబంధం లేదు. కానీ...అమెరికాను కనుగొన్న కొలంబస్ , ఈ సినిమాలో కొలంబస్ క్యారెక్టర్స్ ఒకేలా ఉంటాయి.ఈ సినిమాలో కొలంబస్ కొత్తవి కనిపెడుతుంటాడు. ఏమి కనిపెట్టాడనేది సినిమాలోనే చూడాలి. అయితే కథకు యాప్ట్ కాబట్టే కొలంబస్ అనే టైటిల్ పెట్టాం.
కొలంబస్ లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే...తన లక్ష్యం సాధించడం కోసం ఏం చేయడానికైనా రెడీ. అలాగే తన లక్ష్యం సాధించే వరకు నిద్రపోడు. అవసరం అనుకుంటే జైలుకి వెళ్లడానికైనా రెడీ. ఈ విధంగా నా క్యారెక్టర్ ఉంటుంది.ఇంతకీ లక్ష్యం ఏమిటనేది మీరు సినిమాలోనే చూడాలి.
హీరోయిన్స్ శీరత్ కపూర్, మిస్టీ క్యారెక్టర్స్ గురించి..?
ఈ సినిమాలో హీరోయిన్స ఎవరైతే బాగుంటారా అని చాలా మందిని అనుకున్నాం. ఆఖరికి శీరత్ కపూర్, మిస్టీలను ఫైనల్ చేసాం. వీరిద్దరు పాత్రలకు తగ్గట్టు అద్భుతంగా నటించారు. ఈ సినిమాకి శీరత్ & మిస్టీ చాలా ప్లస్ అవుతారు.
కొలంబస్ లవ్ స్టోరి అంటున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరినా..?
ట్రయాంగిల్ లవ్ స్టోరి అని చెప్పాను. కానీ..డిఫరెంట్ గా ఉంటుంది. ముఖ్యంగా సెకండాఫ్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. యాక్షన్ ఎక్కువ లేకపోయినా ఫీల్ ఉంటుంది.
కొలంబస్ గురించి మీ నాన్నగారు ఏమన్నారు..?
ఈ సినిమాకి కథ-స్ర్కీన్ ప్లే నాన్నగారే అందించారు.ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని నమ్మకంతో ఉన్నారు. ఆయన జడ్జిమెంట్ ఎప్పుడూ తప్పదు. అందుకనే ఈ సినిమా గురించి చాలా ఎక్సైడ్ డ్ గా ఉన్నారు.
నాన్నగారి జడ్జెమెంట్ తప్పదంటున్నారు...అయినా మీకు ఫెయిల్యూర్స్ రావడానికి కారణం ఏమిటనుకుంటున్నారు...?
ఇప్పటి వరకు 5 సినిమాలు చేసాను. అందులో 3 సినిమాలు సక్సెస్ అయ్యాయి. 2 సినిమాలు ఫెయిల్ అయ్యాయి. నాన్న గారు స్ర్కిప్ట్ స్టేజ్ లో జడ్జెజ్ చేస్తారు. కానీ సినిమా అయ్యాకా...సినిమా చూసి...ఇలా చేయండి..మార్చండి అని చెప్పలేరు. నేను 5 సినిమాలు చేస్తే అందులో మూడు సినిమాలు విజయం సాధించడం హ్యాపీ.
నవంబర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. అనుకోకుండా దసరా సీజన్ లో రిలీజ్ చేస్తున్నారు..ఎలా ఫీలవుతున్నారు..?
దసరా అంటే ఫ్యామిలీ అంతా కలసి సినిమా చూడాలనుకుంటారు. అలాంటి సీజన్ లో మా సినిమా రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. మా సినిమాకి దసరా బాగా కలిసోస్తుంది అనుకుంటున్నాం. ఆడియో ఫంక్షన్ చాలా గ్రాండ్ గా చేయాలనుకున్నాం. కానీ టైం లేక చేయలేదు.కానీ మా సినిమా పై నమ్మకంతో ప్రమోషన్ చేయడానికి తక్కువ టైమే ఉన్నా రిలీజ్ చేసేస్తున్నాం.
కొలంబస్ మూవీలో హైలెట్ ఏమిటి..?
ఈ సినిమాలో స్ర్కీన్ ప్లే హైలెట్ అని చెప్పవచ్చు. అలాగే సినిమాలో ఎక్కడా ఫన్ మిస్ అవదు. సెకాండాఫ్ వచ్చే సీన్స్ చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటాయి.
యూత్ హీరోస్ లో ఇప్పుడు పోటీ కాస్త ఎక్కువుగానే ఉంది. పోటీని తట్టుకునేందుకు కెరీర్ ను మీరేలా ప్లాన్ చేసుకుంటారు..?
కాంపిటేషన్ అని నేను అనుకోను. ఇండస్ట్రీ బాగా డెవలప్ అవ్వడానికి అందరు సినిమాలు ఆడాలి అనుకుంటాను.జెలసీ ఫీలింగ్ ఎవరికి ఉండదు. అంతా హెల్ధీ కాంపిటేషనే. నేను అందరి హీరోల సినిమాలు చూస్తాను. ఏదొకటి నేర్చుకుంటానికి ప్రయత్నిస్తాను.
మీ ఫేవరేట్ హీరో ఎవరు..?
మా సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ లో వర్క్ చేసిన వెంకటేష్, మహేష్, ప్రభాస్ అంటే ఇష్టం.
కొలంబస్ గురించి ఆడియోన్స్ కి ఏం చెబుతారు..?
ఫ్రెండ్స్ తో కలసి చూసినా..ఫ్యామిలీతో కలసి చూసినా..ఎవరితో కలసి చూసినా బాగా కొలంబస్ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా సెకండాఫ్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments