'జన్మస్థానం' పాటల విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
కృష్ణచంద్ర, షమాసింగ్, పావని, రూపిక నటీనటులుగా భరత్ కలర్ ల్యాబ్ సమర్పణలో సువన్ రాయ్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న సినిమా జన్మస్థానం. సాయికుమార్ ప్రధానపాత్ర పోషిస్తున్నారు. కె.రాయన్న నిర్మాత. ఓంసాయిప్రకాష్ దర్శకుడు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల హైదరాబాద్ లో జరిగింది. వీరశంకర్ బిగ్ సీడీని ఆవిష్కరించారు. సుద్దాల ఆశోక్ తేజ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా...
చిత్ర దర్శకుడు ఓం సాయిప్రకాష్ మాట్లాడుతూ `స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల నేపథ్యంలో రూపొందుతోన్న సినిమా. సామాజికి అంశంతో తెరకెక్కతుంది. తెలుగు, కన్నడంలో చేస్తున్నాం. నిర్మాత సహకారం మరువలేనిది. కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చే సినిమా`` అని తెలిపారు.
చిత్ర నిర్మాత కె.రాయన్న మాట్లాడుతూ `సినిమా షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమా అనుకున్నట్టుగానే చక్కగా వచ్చింది`` అన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులు చిత్రయూనిట్ ను అభినందించారు.
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments