'చుట్టాలబ్బాయి'గా రానా
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రతిష్టాత్మక సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రానా హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందనే విషయం అందరికి తెలిసిందే. 'యువత', 'సోలో', 'ఆంజనేయులు' చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ పరుశురాం ఈ సినిమాని తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాకి 'చుట్టాలబ్బాయి' అనే టైటిల్ రిజిష్టర్ చేయించినట్టు సమచారం.
పరుశురాం చెప్పిన లైన్ నచ్చడంతో రానా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ప్రస్తుతం బాహుబలి, రుద్రమదేవి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ సోలో హీరోగా చేయడానికి ఆసక్తిని చూపుతున్నాడు. ఆ పనిలో భాగంగా సొంత సంస్థ సురేష్ ప్రొడక్షన్ లో ఈ సినిమా చేయనున్నాడట. పరుశురాం స్ర్కిప్ట్ పనిలో బిజీగా ఉన్నాడు. త్వరలో ఇతర ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ వివరాలు తెలియవచ్చు.
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments