'చిరుత' తరువాత..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా. 'చిరుత'తో కథానాయకుడిగా తొలి అడుగులు వేశాడు రామ్ చరణ్. ఆ తరువాత వచ్చిన రెండో సినిమా అయిన 'మగధీర'తో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆనక 'రచ్చ, నాయక్' వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన ఈ యువ హీరో అతి త్వరలో 'ఎవడు' తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఈ చిత్రం తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో వెంకటేష్ తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్.ఈ చిత్రం కోసం చెర్రీతో ఓ కొత్త నాయిక జోడీ కట్టనుందని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. కథానాయకుడిగా తెరంగేట్రం చేసిన 'చిరుత' కోసం నేహా శర్మ అనే కొత్త హీరోయిన్ తో జతకట్టిన చరణ్. ఆ చిత్రం తరువాత మరే సినిమాలోనూ కొత్త హీరోయిన్ తో జట్టుకట్టని చెర్రీ. చాన్నాళ్ల తరువాత కొత్తమ్మాయితో కలిసి నటించనుండడం అనే అంశం ఫిల్మ్ నగర్ లో ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ నూతన నాయిక ఎవరో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments