'గ్రీన్ సిగ్నల్' టీజర్ లాంఛ్...
- IndiaGlitz, [Wednesday,November 13 2013]
ఎస్ఎల్ వి, మారుతి టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'గ్రీన్ సిగ్నల్...' రేవంత్, రక్షిత, మానస్, మనాలి, అశుతోష్ ప్రధాన పాత్రధారులు. మారుతి సమర్పణ. రుద్ర పాటి రమణరావు నిర్మాత. విజయ్ మద్దాల దర్శకుడు. బుధవారం ఈ సినిమా టీజర్ ను హైదరాబాద్ లో మారుతి విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'ఇది వరకు సినిమాల్లోకి రావాలని ఎంతో ప్రయత్నించాను. కానీ మారుతి వంటి మిత్రుడి సహకారంతో ఈ సినిమాకి నిర్మాతగా మారాను. ఈ సినిమా చిత్రీకరణకి 70-80రోజులు పట్టింది. డిసెంబర్ చివరలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ 'యువతను ఆకట్టుకొనే కథాశంత సినిమా చేశాను. మంచి సంగీతం కుదిరింది. చాలా బాధ్యతతో పనిచేశాను. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షాకాదరణ పొందుతుంది అని అన్నారు.
మారుతి మాట్లాడుతూ ఎ ఫిల్మ్ బై అరవింద్ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పనిచేసినపుడు విజయ్ ఆ సినిమా దర్శకత్వశాఖలో పనిచేశాడు. చిన్న సినిమా అయినప్పటికీ క్వాలిటీ ఎక్కడా మిస్ కాలేదు. మధురిమ ఒక పాటలో కనిపిస్తుంది. డింపుల్ కీలకపాత్రలో నటించింది. నటీనటులంతా బాగా నటించారు. అవుట్ పుట్ బాగా వచ్చింది. డిసెంబర్ చివర్లో లేక జనవరి మొదట్లో గానీ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని అన్నారు.