ఖైదీ నంబర్ 150 నటుడిగా నా ఇమేజ్ పెంచింది -డా.కిషోర్ కోయ
- IndiaGlitz, [Friday,January 27 2017]
ఖైదీ నంబర్ 150 సినిమాలో ఐఏఎస్ రోల్ తనకి గొప్ప గుర్తింపు తెచ్చిందని అంటున్నారు యాక్టర్ కం డాక్టర్ కిషోర్. కోయ. ఐఏఎస్ క్యారెక్టర్‌లో చక్కగా నటించావని ఐఏఎస్, ఐపీఎస్‌లే తనకి కాల్ చేసి అభినందించారని చెబుతున్నారు. ఖైదీనంబర్ 150 సెన్సేషనల్ హిట్ కావడం, తన పాత్రకు చక్కని గుర్తింపు దక్కడం చాలా సంతోషాన్నిచ్చిందని అన్నారు.
డా.కిషోర్ కోయ మాట్లాడుతూ - వి.వి.వినాయక్ గారు చాలా సన్నిహితులు. ఒకరోజు సర్‌ప్రైజింగ్‌గా 'నాయక్'లో మంచి క్యారెక్టర్ ఉంది చేయండి అని ఛాన్సిచ్చారు. నాయక్‌లో కోల్‌కత్తా పోలీసాఫీసర్‌గా నటించాను. అది చేసిన తర్వాత స్నేహితులు, పరిశ్రమ నుంచి ప్రశంసలు దక్కాయి. చాలా థ్రిల్ కలిగించింది. స్క్రీన్ ప్రజెన్స్ చూసుకున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలా మంది ఫ్రెండ్స్ ఫోన్ చేసి అభినందించారు. ఆ తర్వాత 'ఎవడు'లో రామ్‌చరణ్ - బన్ని కాంబినేషన్‌లో డాక్టర్ క్యారెక్టర్ చేశాను. వినాయక్ గారి 'అల్లుడు శీను' చిత్రంలోనూ అబూదబీ-ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్‌గా నటించాను. 'వీకెండ్ లవ్' చిత్రంలో నెగెటివ్ రోల్ చేశాను.
ఇప్పుడు 'ఖైదీనంబర్ 150'లో బ్రేక్ ఇచ్చే రోల్ చేశాను. 500 పైగా కాల్స్ వచ్చాయి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం ఫోన్ చేసి కలెక్టర్ పాత్రలో చాలా బాగా నటించావని ప్రశంసించారు. ఇంత చక్కని క్యారెక్టర్ ఇచ్చి ఎంకరేజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారు, వినాయక్ గారికి ధన్యవాదాలు. ప్రస్తుతం వరుణ్‌తేజ్ - శ్రీనువైట్ల కాంబినేషన్‌లోని 'మిస్టర్' సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేస్తున్నా అని తెలిపారు.